Advertisementt

జక్కన్న.. జర క్లారిటీ ఈయరాదే!

Thu 23rd Nov 2017 03:22 PM
ss rajamouli,jr ntr,ram charan,clarity,multistarrer  జక్కన్న.. జర క్లారిటీ ఈయరాదే!
No Clarity on SS Rajamouli Next Film జక్కన్న.. జర క్లారిటీ ఈయరాదే!
Advertisement
Ads by CJ

మొత్తానికి ఒకే ఒక్క ఫొటోతో రాజమౌళి మరలా వార్తల్లో నిలుస్తూ, పలువురి చర్చలకు కేంద్రబిందువు అవుతున్నాడు. వర్మ, పోసాని వంటి వారు తమ ట్వీట్స్‌, మాటల ద్వారా వార్తల్లో ఉంటుంటే, జక్కన్న వంటి వారు మాత్రం ఒకే ఒక్క ఫోటోతో తాము కూడా అందరికీ అర్ధం కాని రీతిలో వార్తల్లో ఉండటం ఎలా? అనేది చేసి నిరూపిస్తున్నారు. ఇక 'బాహుబలి' రెండు పార్ట్‌ల తర్వాత రాజమౌళి తదుపరి చిత్రం కోసం దేశంలోని అన్ని వుడ్‌లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. తాజాగా రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లతో తాను తీసుకున్న ఫొటో ద్వారా ఆయన ఇప్పుడు మరలా నేషనల్‌ మీడియా అటెన్షన్‌ని సాధిస్తున్నాడు. ఇక ఆయన చేసేది రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ల మల్టీస్టారర్‌ అనేది మాత్రం గట్టిగా వినిపిస్తోంది. ఇందు కోసం ఓ లైన్‌ని అనుకుని, ఈ ఇద్దరిని సెట్‌ చేశారట. ఇద్దరు సమానమైన ఇమేజ్‌, క్రేజ్‌ ఉన్న స్టార్స్‌తో నిజమైన మల్టీస్టారర్‌ తీయాలంటే కథ, స్క్రీన్‌ప్లే, ఇద్దరి ఇమేజ్‌లు, వారి అభిమానుల అంచనాలను అందుకునేలా చేయాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. 

సాధారణంగా సింగిల్‌ స్టార్‌ చిత్రాలకే కథ, స్క్రీన్‌ప్లే, ఇతర ప్రీప్రొడక్షన్‌, క్యాస్టింగ్‌లకు ఆరేడు నెలలు తీసుకునే జక్కన్న, విజయేంద్రప్రసాద్‌లకి పూర్తి స్క్రిప్ట్‌ రెడీ చేయాలంటే కనీసం ఏడెనిమిది నెలలు పడుతుంది. ఇక రామ్‌చరణ్‌ ప్రస్తుతం 'రంగస్థలం' చేస్తున్నాడు. ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుంది అనే విషయం పక్కనపెడితే షూటింగ్‌ మాత్రం డిసెంబర్‌ ప్రధమార్ధంలోనే పూర్తి కానుంది. జనవరి లేదా ఫిబ్రవరిలో ఆయన బోయపాటి శ్రీనుతో చేసే చిత్రం మొదలవుతుంది. ఇక ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ల చిత్రం కూడా ఫిబ్రవరిలోనే మొదలుకానుంది. ఈ ఇద్దరు హీరోలు తమ కొత్త చిత్రాలను ఆరునెలల్లో పూర్తి చేసి దసరాని టార్గెట్‌ చేయనున్నారు. సో.. ఆ తర్వాత అక్టోబర్‌ నుంచి రాజమౌళి మల్టీస్టారర్‌ మొదలవుతుందట. 

ఇక్కడ విషయం ఏమిటంటే.. కేవలం తెలుగు స్టార్స్‌తోనే ఒకే భాషలో చిత్రం చేస్తే అది ఫైనాన్షియల్‌గా వర్కౌట్‌ కాదు. బాలీవుడ్‌ పరిధి ఎక్కువ కాబట్టి అక్కడ వర్కౌట్‌ అవుతుంది. ఎంతమంది స్టార్స్‌, వారికి అభిమానులు ఉన్నా కూడా సినిమా ఎలా ఉంది? పాజిటివ్‌ టాక్‌ స్ప్రెడ్‌ చేయాలా? లేక నెగటివ్‌ ప్రచారం చేయాలా? అని అందరు స్టార్స్‌ అభిమానులు పెద్ద స్టార్స్‌ నటించిన ఇతర చిత్రాలను కూడా చూస్తారు. ఆ విధంగా చూసుకుంటే రాజమౌళికి ప్రేక్షకుల స్థానం పెరగకపోవచ్చు. ఇక 'బాహుబలి'తో ప్రభాస్‌ ని నేషనల్‌ స్టార్‌ని చేసిన రాజమౌళి ఈ చిత్రం ద్వారా అన్ని భాషలను టార్గెట్‌ చేసి ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లకు కూడా జాతీయ స్థాయి గుర్తింపు తీసుకుని వస్తాడో లేదో చూడాలి..! 

No Clarity on SS Rajamouli Next Film:

Cooked up stories are spreading like a wildfire on Mega Power Star Ram Charan and Young Tiger Ntr's multistarrer film to be directed by Rajamouli.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ