Advertisementt

నితిన్ పై 'లై' ఛాయలే లేవంటే కారణం ఇదే!

Thu 23rd Nov 2017 01:26 PM
nithiin,krishna chaitanya,ooty,pawan kalyan,trivikram srinivas  నితిన్ పై 'లై' ఛాయలే లేవంటే కారణం ఇదే!
Krishna Chaitanya and Nithiin Movie Shooting Update నితిన్ పై 'లై' ఛాయలే లేవంటే కారణం ఇదే!
Advertisement
Ads by CJ

హీరో నితిన్ 'లై' సినిమా పరాజయంతో కాస్త డీలా పడినా.. వెంటనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని మొదలెట్టేసి యమా స్పీడుగా షూటింగ్ కానిచ్చేస్తున్నాడు. అయితే నితిన్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద ఫ్యాన్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే నితిన్ చిన్నప్పటినుంచి పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తూ పెరిగానని గతంలో చాలాసార్లు చెప్పాడు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓన్ ప్రొడక్షన్ హౌస్ లో నితిన్ హీరోగా నటిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మరియు నితిన్ ఓన్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. లిరిసిస్ట్ మరియు రౌడీ ఫెలో మూవీ దర్శకుడు కృష్ణ చైతన్య ఈ చిత్రానికి దర్శకుడు. 

జూలైలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఊటి లో ఒక కీలక షెడ్యూల్ ని జరుపుకుంటుంది. అక్కడ నితిన్ ఇంకా మేఘ ఆకాష్ లపై కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోపాటు దర్శకుడు త్రివిక్రమ్ కూడా వన్ అఫ్ ది ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే పవన్ - త్రివిక్రమ్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు అనగానే ఈ సినిమాపై పై అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే కేవలం నిర్మాతగానే కాకుండా త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలోనూ ఇన్వాల్వ్ అయ్యాడంటున్నారు.

త్రివిక్రమ్ కనుసన్నల్లోనే ఈ సినిమాని దర్శకుడు కృష్ణ చైతన్య తెరకెక్కిస్తున్నాడనే టాక్ వినబడుతుంది. ఈ సినిమా స్క్రిప్ట్ లో త్రివిక్రమ్ హ్యాండ్ వుండడంతోనే నితిన్ కూడా ఆరామ్స్ గా ఈ సినిమా షూటింగ్ చేస్తున్నాడట. ఇకపోతే త్వరగా రెగ్యులర్ షూటింగ్ ని కంప్లీట్ చేసి వచ్చే ఏడాది మార్చ్ లో సినిమా ని రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తుంది చిత్ర బృందం.

Krishna Chaitanya and Nithiin Movie Shooting Update:

Nithiin New Movie Shooting in Ooty

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ