Advertisementt

బాబోయ్.. సినిమాలే సినిమాలు!

Thu 23rd Nov 2017 10:41 AM
tollywood,11 films,release,friday,box office  బాబోయ్.. సినిమాలే సినిమాలు!
Films Release on November 24th List బాబోయ్.. సినిమాలే సినిమాలు!
Advertisement
Ads by CJ

ఈ నవంబర్ నెల మొత్తం ఎప్పటినుండో విడుదలకు నోచుకోని సినిమాలతో పాటే... చిన్న చితక సినిమాలతోపాటే... తమిళ సినిమాలు కూడా కోకోల్లలుగా విడుదలకు సిద్దమవుతున్నాయి. నవంబర్ మొదటి వారంలో మూడు సినిమాలు రిలీజైతే.. ఆ తర్వాతి వారంలో దాదాపు నాలుగు సినిమాలొచ్చాయి. అలాగే గత శుక్రవారమైతే ఏకంగా ఏడెనిమిది సినిమాల దాకా రిలీజయ్యాయి. మరి ఈ మూడు వారాల్లో ఒకటి రెండు మాత్రమే చెప్పుకోదగ్గ సినిమాలు. మిగతావన్నీ పేర్లు కూడా బయటికిరాని సినిమాలు. అసలా సినిమాలు ఎప్పుడు తెరకెక్కించారో కూడా తెలియని విషయం.

ఇకపోతే ఈ నవంబర్ చివరి వారంలో కూడా బాక్సాఫీసు వద్ద మళ్ళీ ఏడెనిమిది సినిమాలు క్యూ కట్టాయి. ఈ వారంలో విడుదలయ్యే సినిమాల్లో కూడా రెండు మూడు మాత్రమే కాస్త చెప్పుకోదగిన సినిమాలు. మిగతావన్నీ సోదిలోకి రాని సినిమాలే ఎక్కువ. ఇకపోతే నారా రోహిత్ - రెజినా జంటగా రమ్యకృష్ణ ముఖ్యపాత్రలో తెరకెక్కిన బాలకృష్ణుడు ఈ శుక్రవారమే విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో కాస్త మెరుగ్గా ఉంది. అలాగే ఇండస్ట్రీలో నారా రోహిత్ ఫ్రెండ్ శ్రీ విష్ణు హీరోగా రాజ్ కందుకూరి నిర్మించిన మెంటల్ మదిలో కూడా విడుదల కాబోతుంది. ఈ సినిమాకి సంబందించిన ప్రమోషన్స్ నిల్.  అంతే కాకూండా ప్రతినిధి సినిమా రచయిత ఆనంద్ రవి హీరోగా తెరకెక్కిన నెపోలియన్ కూడా ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

వాటితో పాటే..  సాయి పల్లవి - దుల్కర్ సల్మాన్ ల మలయాళ డబ్బింగ్ హే పిల్లగాడా,  దేవిశ్రీ ప్రసాద్ తో పాటు ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారు, బేబీ, లచ్చి, జంధ్యాల రాసిన ప్రేమకథ, జూన్ 143, జూలీ 2, కోకో... వంటి సినిమాలు కూడా ఈ శుక్రవారమే రాబోతున్నాయి. అసలిందులో కొన్ని సినిమాల పేర్లు కూడా ప్రేక్షకులకు తెలియవు. మరి నిర్మాతలు ఏ హోప్స్ మీద ఈ సినిమాలను థియేటర్స్ లోకి తెస్తున్నారో అనే విషయం వారికే తెలియాలి. ఇక ఈ సినిమాలను ఈ వారం కూడా ప్రేక్షకులు భరించక తప్పేలా లేదు.

Films Release on November 24th List:

Eleven Films Release at the Tollywood Box Office This Week

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ