Advertisementt

కొరటాల నుండి వంశీ పైడిపల్లికి మహేష్!

Thu 23rd Nov 2017 12:45 AM
mahesh babu,vamsi paidipally,25th movie,devi sri prasad  కొరటాల నుండి వంశీ పైడిపల్లికి మహేష్!
Mahesh and Vamsi Paidipally Movie Starting Soon కొరటాల నుండి వంశీ పైడిపల్లికి మహేష్!
Advertisement
Ads by CJ

మహేష్ సినిమా సినిమాకి భారీ గ్యాప్ తీసుకుని ఫ్యామిలీ టూర్స్ తో ఎంజాయ్ చేస్తుంటాడు. కెరీర్ తో పాటు ఫ్యామిలికి ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తుల్లో మహేష్ ముందుంటాడు. అయితే బ్రహ్మ్మోత్సవం, స్పైడర్ సినిమాలు నిరూత్సాహపరిచినప్పటికీ శ్రీమంతుడు వంటి హిట్ అందించిన కొరటాల మీద నమ్మకంతో మహేష్ భరత్ అనే నేను షూటింగ్ లో ఉత్సాహంగా పాల్గొంటున్నాడు. అలాగే గత చిత్రాల ఎఫెక్ట్ కూడా తాజాగా తెరకెక్కుతున్న భరత్ అనే నేను సినిమాపై పెద్దగా పడనట్లే కనబడుతుంది. మహేష్ - కొరటాల కాంబో మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక ఈ సినిమా తర్వాత మహేష్ - వంశీ పైడిపల్లి కలయికలో మహేష్ 25 వ చిత్రం విషయంలో మహేష్ చాలా స్పీడుగా వున్నాడంటున్నారు. కొరటాల సినిమా పూర్తి కాగానే మహేష్ రెండుమూడు రోజుల రెస్ట్ తో వంశీ దర్శకత్వంలో సెట్స్ మీదకెళ్ళిపోతాడట. ఇక షూటింగ్ అస్సలు గ్యాప్ ఇవ్వకుండా ఈ సినిమాని తెరకెక్కించాలని మహేష్ అనుకుంటున్నాడట. మరి మహేష్ ఆలోచనలకూ అనుగుణంగా వంశీ ఇప్పటికే పక్కా స్క్రిప్ట్ ని రెడీ చేసి ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేశాడట.

అలాగే మహేష్ 25 వ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా దేవిశ్రీ, వంశీ ఆధ్వర్యంలో జరిగిపోతున్నాయి. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ మూడు పాటలకు ట్యూన్స్ కూడా కట్టేశాడంటున్నారు. మరి నిజంగానే మహేష్ గనక ఈ సినిమా షూటింగ్ బ్రేక్ ఇవ్వకుండా పూర్తి చేస్తే.. మాత్రం మహేష్ లో టోటల్ చేంజ్ వచ్చినట్టే అంటున్నారు. చూద్దాం మహేష్ ఏమాత్రం స్పీడు చూపిస్తాడో...!

Mahesh and Vamsi Paidipally Movie Starting Soon:

Mahesh and Vamsi Paidipally Movie Updates

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ