గత వారంరోజులుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వానికి అనుకూలమైన వారికి నంది అవార్డులిచ్చి.. అర్హత వున్నవారికి అవార్డులు ఇవ్వలేదని అంటున్నారు. ముఖ్యంగా గుణశేఖర్, నల్లమలుపు బుజ్జి, బండ్ల గణేష్, బన్నీ వాసు వంటి వారు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నంది అవార్డులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రెస్ మీట్స్ పెట్టి మరి నందులపై తమ గళం వినిపించారు. కమ్మ కులానికే పెద్ద పీట వేసి మిగిలిన కులాలను చిన్నచూపు చూశారు అనే విషయం అందరినోట వినబడుతుంది కూడా. అయితే నిన్న సోమవారం వరకు ఈ నందుల రచ్చపై ఏపీ ప్రభుత్వం నుండి ఎటువంటి కౌంటర్ పడలేదు. అయితే నిన్న సోమవారం చిన్నబాబు (లోకేష్) నంది అవార్డుల విషయమై నోరు జారుడు. నందులు గురించి మాట్లాడేవారు ఆంధ్రాలో ఆధార్ కార్డు, ఓటర్ కార్డు కూడా లేనివారు.... హైదరాబాద్ నుండి ఫ్లైట్ లో వచ్చి విజయవాడలో అరగంట ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఫ్లైట్ లో వెళ్ళిపోయేవారు.. నందులు గురించి మాట్లాడతారా? అసలు ఇండస్ట్రీలో ఎవరో ఇద్దరు ముగ్గురు మాత్రమే ఈ నందుల వ్యవహారంపై మాట్లాడారు. మిగతావాళ్ళు గమ్మునున్నారు. అసలు ఈ నంది అవార్డులను మూడు సంవత్సరాలకు గాను ఒక్కసారే ప్రకటించి మంచి చేశామన్నాడు లోకేష్. అలాగే ఈ నందుల రచ్చ వలన నాన్నగారు(చంద్రబాబు) చాలా బాధపడ్డారని చెప్పుకొచ్చాడు మంత్రిగారైన లోకేష్ బాబు.
అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఈ నంది అవార్డుల ప్రకటన వలన ఇంత గందరగోళం అవుతుందనుకోలేదని... జ్యురీ వారు ఎంపిక చేసిన వారికే నందులు ప్రకటించామని.. ఇందులో ప్రభుత్వ ప్రమేయం లేదని... అసలు ఈ నంది అవార్డులను వెనక్కి తీసేసుకుంటామని ఆవేశంగా మాట్లాడారు.
అయితే లోకేష్, చంద్రబాబు మాటలకు బాగా హర్ట్ అయిన నటుడు పోసాని కృష్ణ మురళి ఈరోజు మంగళవారం మీడియాని పిలిచి ప్రెస్ మీట్ పెట్టి మరీ తనకు వచ్చిన నంది అవార్డును స్వీకరించనని... తన నంది వెనక్కి ఇచ్చేస్తానని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. అలాగే ఆధార్ కార్డు ఉంటేనే మాట్లాడాలని లోకేష్ అన్న మాటలను తాను తీవ్రంగా ఖండిస్తానని.. ఆధార్ కార్డు, ఓటర్ కార్డు ఉంటే మర్డర్ చేసెయ్యొచ్చా.. అసలు ఇక్కడ కూర్చుని మనం ట్రంప్ ని విమర్శించడం లేదు. అలాగే ఆంధ్ర - తెలంగాణ విడిపోకముందే అక్కడికి వెళ్లి అక్కడ భూములు కొనేసుకున్నారు. అందులో పోసాని కృష్ణమురళికి ఎక్కడా భూమి లేదు. అక్కడ అమరావతిలో తెలుగుదేశం నేతలే భూముల కొనుక్కున్నారు. అలాగే ఇక్కడ హైదరాబాద్ లో హైటెక్ సిటీని నిర్మించినప్పుడు కూడా.. హైటెక్ సిటీ చుట్టుపక్కల తెలుగుదేశం వారే భూములను కొనేశారు. ఇక్కడ ఎవరూ హీరో కాదు. నేను ఏ పార్టీకి సపోర్ట్ చెయ్యను. ఒకవేళ నాకు నంది రాకుండా నేను గనక ఇలా నోరువిప్పి నేను వైసిపి తరపున మాట్లాడుతున్నా అంటారు. ఏదో నా అదృష్టం కొద్దీ నాకు నంది వచ్చింది.
నేను నా జీవితంలో నంది ముట్టుకోను. అసలు చంద్రబాబు గారు నంది అవార్డులను ఇవ్వము.. వెనక్కి తీసేసుకుంటామనడం కరెక్టేనా? అసలు నంది అవార్డు ఏమైనా సొంత అవార్డా? మీకు నచ్చితే నచ్చినవాళ్ళని పిలిచి బంగారు నందులు ఇచ్చుకోండి. అయినా నేను ఎవరిని సపోర్ట్ చెయ్యను. నాకు ఎవరు మంచిగా ఉంటే వారితో మంచిగా ఉంటా.. ఒకప్పుడు చంద్రబాబు పాలన బావుండేది. అందుకే ఆయన్ని నేను గౌరవించాను. నాకు చంద్రబాబు అన్నా ఒకటే, జగన్ అన్నా ఒకటే, కేసీఆర్ అన్నా ఒకటే. అందరూ కమ్మవారికే అవార్డ్స్ ఇచ్చారు అని అంటున్నారు.. ఇప్పుడు నేను కూడా ఇదే అంటున్నా.. ఇంతవరకు నేను అనలేదుగాని.. ఇప్పుడు మాత్రం నేను అంటా... ఇవి కమ్మ అవార్డ్స్. ఈ విధముగా పోసాని కృష్ణ మురళి ఏపీ ప్రభుత్వాన్ని ఏకిపారేశారు. ఏదైనా పోసాని కృష్ణ మురళి ఈ విషయంలో మాత్రం గ్రేట్ అనే చెప్పాలి.