Advertisementt

బాలయ్య నాకు దేవుడు.. అంటున్న యాంకర్!

Wed 22nd Nov 2017 12:16 AM
uday bhanu,neethone dance,balakrishna,god  బాలయ్య నాకు దేవుడు.. అంటున్న యాంకర్!
Uday Bhanu Emotional Speech About Balakrishna బాలయ్య నాకు దేవుడు.. అంటున్న యాంకర్!
Advertisement
Ads by CJ

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డ్స్ చాలా మందిని నిరాశకు గురిచేసిందని తెలిసిందే. ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి బాగా అన్యాయం జరిగింది అని మెగా కాంపౌండ్ నుండి బన్నీ వాసు, బండ్ల గణేష్ అవార్డ్స్ పై విరుచుకుపడ్డారు. అయితే నంది అవార్డ్స్ అన్ని నందమూరి ఫ్యామిలీకే రావడంతో బాలకృష్ణ పై చాలా మంది కోపంగా వున్నారు.

ఇది ఇలా ఉండగా బాలకృష్ణని పొగడ్తలతో ముంచెత్తింది ఒక ప్రముక టీవీ యాంకర్. మా టీవీ లో ప్రసారం అయ్యే నీతోనే డాన్స్ ప్రోగ్రామ్ కి యాంకర్ గా వ్యవహరిస్తున్న ఉదయ భాను.. బాలకృష్ణని పొగిడేసి సోషల్ మీడియాలో హైలైట్ అయింది.

'నా జీవితంలోనే మొట్ట మొదటి పండగ నా కవల పిల్లల తొలి పుట్టిన రోజు. వాళ్ళ పుట్టిన రోజు ఎంతో ఘనంగా చేద్దాం అనుకుని ఇండస్ట్రీ వాళ్లకి చాలా మందికి ఫోన్ చేశాను. కానీ ఎవరు లిఫ్ట్ చేయలేదు. అప్పుడు బాలయ్య గారికి ఒక మెసేజ్ పెట్టా.. ఆయన తిరిగి నాకు కాల్ చేసి.. నేను మీ ఫంక్షన్ కి కచ్చితంగా అటెండ్ అవుతానని ఫోన్ పెట్టేసారు. ఫంక్షన్ రోజు సరిగా రాత్రి ఏడున్నరకు అలా సింహాలాగా వచ్చారు బాలయ్య. నాకైతే అప్పుడు ఆయనలో ఒక దేవుడు కనిపించాడు. ఫంక్షన్ కి వచ్చి ఐదు నిమిషాలు ఉండి వెళ్లిపోలేదు ఏకంగా 45 నిమిషాలు ఉండి అందరితో నవ్వుతూ ఫొటోలు దిగారు. అలాంటి వాళ్లు ఇండస్ట్రీలో చాలా రేర్ గా వుంటారు. హ్యాట్సాఫ్ బాలయ్య'.. అంటూ ఈ హాట్ యాంకర్ బాలకృష్ణని ఆకాశానికెత్తేసింది.  బాలయ్య గురించి ఉదయభాను అలా చెప్పగానే బాలయ్య  ఫాన్స్ ఆనందంలో మునిగితేలిపోతున్నారు.

Uday Bhanu Emotional Speech About Balakrishna:

Ballayya is God For Me, Says Ancor Udaya Bhanu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ