Advertisementt

శైలజా రెడ్డిపై అభిప్రాయం మారిందా?

Tue 21st Nov 2017 09:18 PM
naga chaitanya,sailaja reddy alludu,sridevi,ramya krishna  శైలజా రెడ్డిపై అభిప్రాయం మారిందా?
Sridevi Turns Naga Chaitanya Aunt for Maruthi Film శైలజా రెడ్డిపై అభిప్రాయం మారిందా?
Advertisement
Ads by CJ

ప్రస్తుతం నాగచైతన్య... చందు మొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి' సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే స్టార్ట్ అయ్యి శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన నిధి అగర్వాల్ నటిస్తుంది. ఇకపోతే నాగచైతన్య 'సవ్యసాచి' సినిమాతోపాటే మారుతి దర్శకత్వంలో కూడా నటించబోతున్నాడు. డిసెంబర్ లో సినిమా ఓపెనింగ్ కార్యక్రమాలు చేసి జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ జరిపే యోచనలో చైతు - మారుతిలు ఉన్నారు. ఇకపోతే నాగచైతన్య - మారుతీ కలయికలో తెరకెక్కబోతున్న సినిమాకి 'శైలజా రెడ్డి అల్లుడు' అనే టైటిల్ పరిగణనలో ఉంది.

అయితే 'శైలజా రెడ్డి అల్లుడు' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈసినిమా ఇగోస్ ఆఫర్ట్ మ్యారేజ్ అనే లైన్ పై రూపొందించిన కథతో నడుస్తుందట. అంతే కాకుండా ఈ సినిమా మొత్తం అత్త పాత్ర చుట్టూనే నడుస్తుందట. ఈ కథలో అత్త పాత్ర కీలకం కాబట్టి... ఈ సినిమాలో మంచి పవర్ ఫుల్ అత్తని తీసుకునే విషయంలో మొదటగా రమ్యకృష్ణని అనుకున్నారట. అయితే రమ్యకృష్ణ దాదాపు మారుతీ - చైతు సినిమాలో ఫిక్స్ అనే వార్తలు కూడా వచ్చాయి. కానీ రమ్యకృష్ణ ఇప్పటికే చాలా సినిమాల్లో అత్తా, అమ్మ పాత్రల్లో కనబడడంతో... మారుతీ తన సినిమాలో ఎవరైనా కొత్త అత్త అయితే బావుంటుందని ఆలోచిస్తున్నాడట.

అందులో భాగంగానే అతిలోక సుందరి శ్రీదేవి అయితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తుందట చిత్ర బృందం.  మరి నాగచైతన్య అత్తగా శ్రీదేవి అంటే అసలు ఇక ఆ కాంబినేషన్ కు వచ్చే క్రేజ్ వేరుగా వుంటుంది. అంతే కాకుండా చైతుకి అత్తగా శ్రీదేవిని తీసుకురావడం కూడా పెద్ద కష్టం కాదు.. ఎందుకంటే అక్కినేని ఫ్యామిలీతో శ్రీదేవి కి విడదీయలేని అనుబంధం ఉంది. కాబట్టి.. శ్రీదేవి దగ్గరకి ఈ ప్రపోజల్ వెళ్ళగానే ఆమె ఒప్పేసుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందనుకుంటున్నారట. అలాగే ఈ ప్రాజెక్ట్ లోకి శ్రీదేవిని తీసుకుంటే తమ సినిమాకి తమిళ, హిందీ భాషల్లో కూడా క్రేజ్ వస్తుందని మారుతి భావిస్తున్నాడని టాక్ వినబడుతుంది. చూద్దాం ఫైనల్ గా శైలజా రెడ్డి ఎవరనేది..?

Sridevi Turns Naga Chaitanya Aunt for Maruthi Film :

Sridevi Turns Naga Chaitanya Aunt for Sailaja Reddy Alludu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ