'సోగ్గాడే చిన్ని నాయనా, రాజుగారి గది2 ' సినిమాల తర్వాత నాగార్జున అనూహ్యంగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో సినిమాకి శ్రీకారం చుట్టాడు. నాగ్ తీసుకున్న ఈ నిర్ణయం అందరిని షాక్ కి గురిచేసింది. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ హిట్ కి మొహం వాచిపోయి ఉన్నాడు. వర్మని విజయం పలకరించి చాలా ఏళ్ళు అయ్యింది. అందులోను వర్మ మైండ్ సెట్ పూర్తిగా మారిపోయిన టైం లో నాగ్ ఇలా ఆర్జీవికి సినిమా చెయ్యడం ఎవ్వరికి మింగుడు పడడం లేదు. కానీ నాగ్ మాత్రం తాను వర్మ చెప్పిన స్టోరీ లైన్ కి పడిపోయే సినిమాని ఓకె చేసానని.. వర్మతో తన సినిమా కొత్తగా ఉంటుందంటున్నాడు. అలాగే శివ టైం లో కూడా ఆ సినిమా హిట్ అవుతుందనుకోలేదని... ఇప్పుడు కూడా సినిమా హిట్ అవుతుందనుకోవడం లేదని చెబుతున్నాడు.
మరో పక్క వర్మ కూడా నాగ్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. లేకుంటే తనకి దర్శకుడిగా పరిశ్రమలో మనుగడ ఉండదని.. ఈసినిమాకు కాస్త శ్రమిస్తున్నాడు. అయితే నాగార్జున మాత్రం వర్మని గుడ్డిగా నమ్మేస్తున్నాడని కొందరు ఇప్పటికి నెత్తినోరు కొట్టేసుకుంటున్నారు. వర్మ పిచ్చి పరాకాష్టలో ఉంది... ఈ టైం లో నాగ్.. వర్మని గుడ్డిగా నమ్మి రాంగ్ స్టెప్ వేస్తున్నాడంటున్నారు. మరి రామ్ గోపాల్ వర్మ - నాగ్ కలయికలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏదో ఇంగ్లీష్ సినిమా రీమేక్ అనే ప్రచారం మొదలైంది. వర్మ ఈ సినిమాలో పోలీస్ పాత్రలో నాగార్జునని చూపించబోతున్నాడట. అలాగే ఈ సినిమాలో నాగ్ లుక్ కూడా కాస్త భయానకంగానే ఉంది. ఈ సినిమా కథ మొత్తం ఒక చిన్న పాప కిడ్నాప్ చుట్టూ తిరుగుతుందని టాక్. యాక్షన్ సినిమాగా ఈ సినిమాని వర్మ తెరకెక్కించబోతున్నాడు. మరి వర్మని నమ్మి నాగార్జున ఈసినిమాకి భారీ బడ్జెట్ పెడుతున్నాడని... కానీ వర్మకి అంత సీన్ లేదనే టాక్ కూడా నడుస్తుంది.
ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోస్ లో వర్మ తన తల్లి ఫస్ట్ క్లాప్ తో ఈ సినిమా మొదలైంది. మరి నాగార్జున నమ్మకాన్ని వర్మ ఎంతగా నిలబెడతాడో అనేది ఈసినిమాతో తెలిసిపోతుంది. అలాగే వర్మ ఇక డైరెక్టర్ గా సినిమా ఇండస్ట్రీలో ఉంటాడో లేదో అనేది కూడా ఈ సినిమాతోనే తేలిపోతుంది. చూద్దాం ఏం జరుగుతుందో.