సమస్యలపై ప్రజల్లో పోరాడుతూ, జగన్ పాదయాత్ర చేస్తుంటే ఆయన్ను ప్రజల్లోకి పంపి తాము అసెంబ్లీకి వెళ్లి సమస్యలపై నిలదీయాల్సిన వైసీపీనాయకులు అసెంబ్లీ సమావేశాలనే బహిష్కరించారు. ప్రభుత్వం వాటికి సమాధానం ఇచ్చినా.. ఇవ్వకపోయినా ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తే సమస్యలు ఎక్కువగా ప్రజలను ఆకర్షింపజేసి, ఆలోచింపజేస్తాయి. అంతేగానీ తమ ప్రతిభను, కష్టాన్ని నమ్ముకోకుండా అధికార పార్టీ వ్యతిరేకతే తమకు అధికారం కట్టబెడుతుందని భావించడం తప్పు. ఇక జగన్ మీ అన్న ముఖ్యమంత్రి అవుతాడు.. మీకు 'నవరత్న' ఆయిల్ ఇస్తానంటూ ఊహల్లో విహరిస్తున్నాడు గానీ నేడు ఏపీలో అధికార పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఏపీలోని బోలెడు సమస్యలపై మాత్రం జగన్ పోరాటం చేయలేకపోతున్నాడు.
ఇక వచ్చే ఎన్నికల్లో మాదే విజయమని ఇప్పటినుంచే వైసీపీ వర్గాలు అత్యుత్సాహం చూపుతున్నాయి. కిందటి ఎన్నికల్లో, నంద్యాల, కాకినాడ ఎన్నికల ముందు కూడా ఇదే చెప్పారు. ఇక జగన్ ముఖ్యమంత్రి అయితే ఎవరికి ఏ పదవి ఇవ్వాలి? ఎవరిని మంత్రులను చేయాలి? అనేది కూడా వారే నిర్ణయిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేవెళ్ల చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డిని హోం మినిస్టర్‌ని చేసినట్లే.. జగన్ కూడా రోజాని హోం మినిస్టర్‌ని చేస్తాడట.
ఇక రాజశేఖర్ రెడ్డి ఏ కార్యక్రమమైనా, పాదయాత్ర నుంచి అన్నింటిని చేవెళ్ల నుంచే ప్రారంభించి, సెంటిమెంట్‌గా ఫీలయ్యే వాడు. అప్పుడు వైఎస్‌కి సబితా అంటే ఎంత సెంటిమెంటో రోజా అంటే కూడా జగన్‌కి అంతే సెంటిమెంట్ అని అంటున్నారు. అయితే పాదయాత్రను కూడా నగరి నుంచి ప్రారంభించవచ్చు కదా! ఇక రోజా హోంమినిస్టర్ పదవి పక్కన సంగతి ఆమె ఈసారి నగరిలో గెలిచే పరిస్థితులే లేవని, ఆమె తమ నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదనే వార్తలు వస్తున్నాయి.