Advertisementt

ఆర్జీవీ, నాగ్ ఫస్ట్ లుక్ సెన్సేషన్..!

Mon 20th Nov 2017 08:29 PM
nagarjuna,rgv,first look,chai galss,pisthol,hat  ఆర్జీవీ, నాగ్ ఫస్ట్ లుక్ సెన్సేషన్..!
RGV and Nagarjuna Movie Opening Poster ఆర్జీవీ, నాగ్ ఫస్ట్ లుక్ సెన్సేషన్..!
Advertisement
Ads by CJ

సాదారణంగా సినిమా షూటింగ్ దశలో వున్నపుడు కానీ, షూటింగ్ ఫినిష్ అయ్యాక కానీ ప్రొమోషన్స్ స్టార్ట్ చేస్తారు చాలా మంది దర్శక నిర్మాతలు. కానీ అలా చేస్తే రామ్ గోపాల్ వర్మ ఎందుకు అవుతాడు. తన సినిమా స్టార్ట్ అవకముందే సినిమా ఎలా వుండబోతుందో ప్రొమోషన్స్ రూపంలో చెప్పేస్తాడు రాము. లేటెస్ట్ గా తాను నాగార్జునతో తీయబోయే సినిమాకు ఫస్ట్ పోస్టర్ తో రిలీజ్ కు ముందే సెన్సేషన్ కు తెరలేపాడు.

ఫ్యామిలీ సినిమాలు తీసి విసిగిపోయిన నాగార్జున.. రాము చెప్పిన కథ నచ్చి ఒకే చేశాడు. ఈ సినిమా షూటింగ్ కి కూడా రెడీ అయిపోయింది. అయితే రాము ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్న సందర్భంగా ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేశాడు. ఓ టేబుల్ పై పిస్టల్ - పోలీస్ - ఏక్ గ్లాస్ చాయ్.. అంతే ఇంకా ఏమి లేవు. ఒక్క ఫోటోతోనే ఇంట్రస్ట్ క్రియేట్ చేశాడు ఆర్జీవీ. సోషల్ మీడియాలో కూడా ఈ ఫొటోకు ప్రశంసలు కురిపిస్తున్నారు.

వీళ్లిద్దరి కాంబినేషన్ లో శివ, అంతం, గోవిందా.. గోవిందా సినిమాలు వచ్చాయి. దాదాపు రెండు దశాబ్దాల తరవాత వీళ్లిద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. మాఫియా - పోలీస్ కథలను ఆర్జీవీ బాగా తీయగలడని నమ్మి ఛాన్స్ ఇచ్చాడు నాగ్. మరి నాగ్ ఆశించినట్టు వర్మగారు మంచి యాక్షన్ ఎంటర్ టెయినర్ తీయాలనే ఆశిద్దాం.

RGV and Nagarjuna Movie Opening Poster:

RGV and Nag Movie First Look Sensation Starts 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ