ఈరోజుల్లో ఎలాంటి చిత్రమైనా మొదటి వీకెండ్ నుంచి రెండో వీకెండ్ దాకా కూడా స్టడీ కలెక్షన్లు సాధించలేకపోతున్నాయి. వారానికే పైరసీలు రావడం, కొత్త చిత్రాలు థియేటర్లకు వస్తూ ఉండటంతో సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా అది స్ప్రెడ్ అయ్యేలోపు పుణ్య కాలం కరిగిపోతోంది. కేవలం పెద్ద స్టార్స్‌తో తీసిన చిత్రాలు, అనూహ్యమైన టాక్ తెచ్చుకునే 'అర్జున్‌రెడ్డి' వంటి చిత్రాలు మాత్రం రెండు వారాల పాటు కలెక్షన్లు రాబడుతున్నాయి. ఇక విషయానికి వస్తే డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటించిన 'పీఎస్వీ గరుడవేగ' చిత్రం దాదాపు 25పైగా కోట్లతో రూపొందుతుండటంతో అందరూ ఆశ్చర్యపోయారు. మొదట్లో కొందరు ఇదంతా చీప్ పబ్లిసిటీగా కూడా భావించారు. కానీ ఈ చిత్రం టీజర్, ట్రైలర్స్ రిలీజైన తర్వాత, భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేసే సన్నిలియోన్ స్పెషల్ సాంగ్ చేయడంతో ప్రేక్షకులకు కాస్త క్యూరియాసిటీ ఏర్పడింది.
అయినా రాజశేఖర్ కదా... ఇంకా ఆయననేం చూస్తామని భావించారు. కానీ సినిమా విడుదలైన తర్వాత మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. రాజశేఖర్‌పై, దర్శకుడు ప్రవీణ్‌సత్తార్‌పై ప్రశంసల వెల్లుల కురిసింది. ప్రవీణ్‌సత్తార్‌కి ఈ చిత్రం తర్వాత ఆయన మేకింగ్ చూసి వరుసగా మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఇక రాజశేఖర్ కం బ్యాక్ మూవీగా అందరు దీనిని అంగీకరించారు. రాజశేఖర్‌లో ఇంకా హీరో మెటీరియల్ ఉందని గుర్తించారు. కానీ చిత్రానికి ఎందరు సినీ ప్రముఖులు సినిమా బాగుందని ప్రమోషన్స్ చేసినా కూడా ఈ చిత్రం ఇప్పటివరకు 7.25కోట్ల షేర్‌ని మాత్రమే రాబట్టింది. ఇంకా ఈ చిత్రం సేఫ్‌జోన్‌లోకి వెళ్లాలంటే మరో 5కోట్లు వసూలు చేయాలి. కానీ అది జరిగే పని కాదని తెలుస్తోంది.
ఈ చిత్రానికి భారీగా బడ్జెట్‌ని పెట్టినప్పటికీ రాజశేఖర్ మార్కెట్‌కి అనుగుణంగానే తక్కువ మొత్తానికి బిజినెస్ చేశారు. ఇక థియేట్రికల్ కలెక్షన్ల విషయం పక్కనపెడితే ఈ చిత్రానికి బాలీవుడ్ నుంచి 5కోట్లకు రీమేక్ హక్కులు, ఇతర భాషల రీమేక్, డబ్బింగ్, డిజిటల్ రైట్స్ ద్వారా మాత్రంబాగానే వస్తుంది. దీంతో బయ్యర్ల పరిస్థితి ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్‌డైడ్ అన్నట్లుగా ఉంది. ఇక రాజశేఖర్ తదుపరి చిత్రంపై ఇప్పటినుంచే అంచనాలు మొదలై ఆసక్తిని రేపుతున్నాయి.