ఇండియాలోని యువతులకు మిస్‌వరల్డ్, మిస్‌యూనివర్శ్ వంటి అవార్డులు గతంలో వచ్చాయి. ప్రియాంకాచోప్రా, సుస్మితాసేన్, ఐశ్వర్యారాయ్ వంటి అందగత్తెలకు తమ ప్రతిభను నిరూపించుకునే వేదికలు మిస్ వరల్డ్, మిస్ యూనివర్శ్ అనే చెప్పాలి. ఇక 2000 వసంవత్సరంలో మిస్ వరల్ద్‌గా ప్రియాంకాచోప్రా గెలుపొందింది. ఆ తర్వాత 17ఏళ్లకు గాను తాజాగా ఈ ఏడాదికి మిస్ వరల్డ్ టైటిల్ మరలా భారతీయ యువతికి లభించడం విశేషం. చైనాలోని సాన్యా నగరంలో జరిగిన ఈ పోటీలలో హర్యానాకు చెందిన మానుషి చిల్లర్ ఈ అవార్డును దక్కించుకుంది.
ఇక ఈమె భారతదేశం నుంచి 29మందితో పోటీ పడి ఈ పోటీలకు తాను ఎంట్రీ ఇచ్చింది. ఇక మిస్ వరల్డ్ వేదికపై 108మందితో తీవ్రమైన పోటీ ఎదుర్కొంది. ద్వితీయ, తృతీయ స్థానాలలో మెక్సికో, ఇంగ్లండ్‌కి చెందిన యువతులు అవార్డులను గెలుపొందారు. కాగా గతంలో ఇండియాను నుంచి మిస్‌వరల్డ్, మిస్ యూనివర్శ్ పోటీలలో గెలుపొందిన వారు బాలీవుడ్ వెండితెరపై ఓ మెరుపు మెరిశారు. ఇక ప్రియాంకాచోప్రా కూడా బాలీవుడ్‌నే కాదు.. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్‌ని కూడా ఓ ఊపు ఊపుతోంది. సో.. తాజాగా 2017 మిస్‌వరల్డ్ అయిన మానుషి చిల్లర్‌కి కూడా ఇక వెండితెర అవకాశాలు వరదలా వెల్లువెత్తడం ఖాయంగా చెప్పాలి.