బాలీవుడ్ దర్శకుడు సంజయ్‌లీలాభన్సాలీ.. దీపికాపదుకొనే లీడ్‌రోల్‌లో తీస్తున్న రాజ్‌పుత్ రాణి వీరచరిత్ర 'పద్మావతి' గత కొన్ని రోజులుగా వివాదాలపై వివాదాలు పెంచుకుంటూ పోతోంది. రాజ్‌పుత్ కులానికి చెందిన కర్ణిసేన, ఇతర హిందు సంస్థలు ఈ చిత్రాన్ని ఆపివేయాలని ఆందోళనలు చేస్తున్నారు. థియేటర్లను తగులబెడుతామని, దీపికాపడుకొనే చెవి, ముక్కులు కోస్తామని, దీపికా, భన్సాలీల తలలు నరికి తీసుకువస్తే 5కోట్లు నజరానా ఇస్తామని బహిరంగంగానే ప్రకటించాయి. అదే సమయంలో డిసెంబర్1న విడుదల కావాల్సిన ఈ చిత్రం సెన్సార్‌కి వెళ్లగా అక్కడ అప్లికేషన్ ఫారమ్ అసంపూర్తిగా ఉందనే సాంకేతిక కారణంతో సెన్సార్ ఆ సినిమాని తిప్పిపంపింది.
ఇక దీపికా పదుకునేని చంపుతామని వస్తున్న హెచ్చరికల నేపధ్యంలో ఆమెకు, భన్సాలీకి సెక్యూరిటీ పెంచారు. దీనిపై దీపిక స్పందిస్తూ... ఓ సినిమాలో నటించిందుకు చంపేస్తారా? అసలు మన దేశంలో ఏం జరుగుతోంది? మనుషులు మనుషుల్లా బిహేవ్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక దీపికా నటించిన హాలీవుడ్ చిత్రాలైన 'ట్రిపుల్‌ఎక్స్, రిటర్న్స్ ఆఫ్ క్జాంజర్‌కేజ్'లలో ఆమెతో కలిసి నటించిన హాలీవుడ్ నటి రూబీరోస్ ఈ సంగతి తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యాయని ట్వీట్ చేసింది.
తన స్నేహితురాలి జీవితంలో జరుగుతున్న పరిణామాలు తెలుసుకున్నానని, ఆమె చేస్తున్న పనికి హ్యాట్సాఫ్ చెబుతున్నానని, అత్యంత అరుదైన ధైర్యవంతురాలిగా దీపికాపడుకోనేను ఆమె అభివర్ణించింది. మరోవైపు మొదట చిత్రం విడుదలను ఆపేసి సినీప్రముఖులు, చరిత్రకారులు, రాజ్‌పుత్ నాయకులతో ఓ కమిటీని వేసి సినిమా చూపించి, వారు సూచించిన మార్పులు చేర్పులు చేసిన తర్వాతనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజే కేంద్రసమాచార, ప్రసారశాఖామంత్రి స్మృతిఇరానీని కోరవడంతో తాజా పరిణామాలు ఇంకా వేడెక్కాయి. సెన్సార్ కూడా ఆపేయడంతో ఈ సినిమా రిలీజ్ పోస్టుపోన్ అయినట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది!