Advertisementt

మెర్సల్ తర్వాత మహేష్ మూవీనే!

Mon 20th Nov 2017 01:26 PM
mahesh babu,bharath ane nenu,mersal,controversy  మెర్సల్ తర్వాత మహేష్ మూవీనే!
Controversy Dialogues in Bharath Ane Nenu movie మెర్సల్ తర్వాత మహేష్ మూవీనే!
Advertisement
Ads by CJ

'బ్ర‌హ్మోత్స‌వం, స్పైడ‌ర్' సినిమాలు డిజాస్టర్ కావటంతో మహేష్ బాబు ఫాన్స్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న 'భరత్ అనే నేను' సినిమా పైనే ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా మొదలైన దగ్గర నుండి ఏదొక న్యూస్ లు సోషల్ మీడియాలో వస్తూనే వున్నాయి. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న స‌మ‌యంలో ఓ ఆస‌క్తిక‌ర వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

'భ‌ర‌త్ అనే నేను' మ‌రో 'మెర్స‌ల్' సినిమా అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు. మెర్సల్ లో మెడికల్ బిజినెస్ గురించి.. జీఎస్టీపై డైలాగులు పేల్చాడు హీరో విజ‌య్‌. ముఖ్యంగా జీఎస్టీపై డైలాగులు సెంట్రల్ ప్రభుత్వంను వణికించింది. దీంతో ఆ డైలాగులు 'మెర్సల్' సినిమాలో మ్యూట్ చేసిన సంగతి కూడా తెలిసిందే. అలాంటి డైలాగులే 'భ‌ర‌త్ అనే నేను'లోనూ ఉన్నాయ‌ట‌. ప్రస్తుత విద్యావ్యవస్థ గురించి కేంద్రంపై సూటి బాణాలు వేయబోతున్నాడట మహేష్.

మరి కేంద్రాన్ని ప్రేశ్నిస్తే 'మెర్సల్' కు పట్టిన స్థితే 'భరత్ అనే నేను'కి పడుతుందని... ఫిలింనగర్ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడున్న విద్యావ్య‌వ‌స్థ మ‌రీ క‌మ‌ర్షియ‌ల్‌గా మారింది. ఎల్‌కేజీ, యూకేజీల‌కే ల‌క్ష‌ల ఫీజులు వ‌సూలు చేస్తున్నారు. వీటిపై ఆందోళ‌న‌లు కూడా జ‌రిగాయి. దీనిని ఆధారంగా తీసుకుని కొరటాల శివ సినిమా తీస్తున్నాడు. మరి 'మెర్సల్' లాగ ఎటువంటి కాంట్రవర్సిస్ లేకుండా 'భ‌ర‌త్ అనే నేను' సినిమా అనుకున్న డేట్ కి  రిలీజ్ అవుతుందేమో చూద్దాం.

Controversy Dialogues in Bharath Ane Nenu movie :

After Mersal, Bharath Ane Nenu Ready to Face Controversy

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ