నటిగా వేద అలియాస్ అర్చనగా పేరున్న నటి మొదట్లో కొన్ని చిత్రాలలో నటించినా కూడా ఫేడవుట్ అయిపోయింది. ఇక ఇటీవల బిగ్‌బాస్ షో సీజన్1 ద్వారా మరలా వార్తల్లోకి వచ్చింది. అసలు ఈమెకు సినిమా ఛాన్స్‌లు రావడమే తక్కువ. కానీ ఈమె మాత్రం బడాయిలు చెబుతోంది. ఈ మధ్య ఓ తమిళ దర్శకుడు అర్చన గురించి మాట్లాడుతూ, అర్చన అందంగా ఉంటుందే గానీ నాజూకుతనం లేదని వ్యాఖ్యానించాడట. దాని గురించి అర్చన స్పందిస్తూ... ఈ విమర్శను నేను మొదటి సారిగా వింటున్నాను. ఇంతవరకు నాతో ఎవ్వరూ అనలేదు. సక్సెస్ అనేది ఉంటే అన్ని కొట్టుకుపోతాయనే సంగతి మీకు తెలిసిందే. ఆ డైరెక్టర్‌కి నేను నాజూకుగా కనిపించలేదేమో...? ఈ ఇండస్ట్రీలో పలువురు పలు రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు.
పెద్ద పెద్ద హేమాహేమీలకే ఇలాంటి విమర్శలు తప్పలేదు. నేనెంత. ఎవరేమనుకున్నా నాపై నాకు నమ్మకం ఉంది. అందువల్లనే ఇంతకాలం ఇండస్ట్రీలో ఉండగలిగాను. లేదంటే ఇంట్లో ఏడుస్తూ కూర్చునే దానిని కదా..! అని సరైన సమాధానమే ఇచ్చింది. అయినా ఇక్కడ అర్చన ఓ విషయం మర్చిపోతోంది. ఆమె ఇండస్ట్రీకి వచ్చి ఎన్నేళ్లయిందో, ఆమె ఎంటర్ అయ్యే నాటికి ఎంత వయసులో ఉంది.. అనేవన్నీ లెక్కిస్తే ఆమెకు ఇప్పుడు దాదాపు ఆంటీ వయసు వచ్చేసింది. మరి ఈ వయసులో సహజమైన అందం మాత్రం అలాగే ఉంటుంది కానీ నాజూకుతనం ఎక్కడి నుంచి వస్తుంది? అనేది సందేహమే. ఈ విషయన్ని చెప్పకుండా ఆమె ఏవేవో చెబుతోంది. వయసు పెరిగే కొద్ది నాజూకుతనం తగ్గిపోతుంది కదా..! అనే ఒకే ఒక్క డైలాగ్‌కి సరిపోయే ఆన్సర్‌కు పేజీల కొద్ది డైలాగ్స్ చెబుతోంది.