తెలుగులో యంగ్‌హీరోలు మంచి సినిమాలను పట్టి స్టార్స్‌గా మారాలంటే అల్లుఅరవింద్, దిల్‌రాజు వంటి వారిని మెప్పిస్తే చాలు మిగిలినదంతా వారే చూసుకుంటారు. ఇక దిల్‌రాజు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటు ఫ్యామిలీ, సెంటిమెంట్ చిత్రాలతో పాటు యూత్‌కి నచ్చే చిత్రాలు, మాస్ చిత్రాలు కూడా తీస్తుంటాడు. 'డిజె', 'సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, శతమానం భవతి, నేను లోకల్, ఫిదా' వంటివే దీనికి ఉదాహరణ. ఇక సాయిధరమ్‌తేజ్ కూడా దిల్‌రాజునే నమ్ముకుని ఆయన మార్గదర్శకంలో ముందుకు సాగుతున్నాడు.
ఇక నితిన్ హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదట్లో తేజతో హిట్స్ కొట్టినా తర్వాత ఆయనకు ఓ రకమైన మాస్ ఇమేజ్‌ని తీసుకొచ్చిన చిత్రం 'దిల్'. ఈ చిత్రాన్ని మొదటి సారిగా దిల్‌రాజు, గిరిలు నిర్మాతలుగా పనిచేశారు. నిర్మాతలుగా వారి మొదటి స్ట్రెయిట్ చిత్రం ఇదే. ఇక ఆ తర్వాత నితిన్ డీలాపడిపోయాడు. ఆయన తండ్రి నిర్మాత అయినా ఆయన్ను ఫ్లాప్‌ల్లోంచి బయటకు లాగలేకపోయాడు. చివరకి ఎలాగోలా మరలా తమ సొంత బేనర్‌లోనే 'ఇష్క్' తో హిట్ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం నితిన్ మరలా ఇంతకాలానికి దిల్‌రాజు నిర్మాతగా ఓ చిత్రం చేస్తున్నాడు. 'శతమానం భవతి' దర్శకుడు సతీష్‌వేగ్నేష్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం టైటిల్ 'శ్రీనివాస కళ్యాణం'.
ఇక ఈ చిత్రం ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఉంటుందని టైటిల్‌ని బట్టే అర్ధమవుతోంది. దీని తర్వాత దిల్‌రాజు మరోసారి అనిల్‌రావిపూడి దర్శకత్వంలో 'డబుల్‌ఎఫ్' అనే మల్టీస్టారర్ చేస్తున్నాడట. ఇందులో ఒక హీరోగా మరోసారి నితిన్‌నే దిల్‌రాజు ఎంపిక చేసుకున్నాడు. ఇక రెండో హీరోగా సాయిధరమ్‌తేజ్ గానీ, నాని గానీ నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.