కేంద్రంలోనే కాకుండా ఉత్తరాది రాష్ట్రాలలో బిజెపికి మంచి పట్టు ఉంది. ఇక బిజెపి అంటే హిందుముద్రను, హిందు అతివాదిగా ముద్రను వేశారు. అది నిజామా? కాదా? అనే విషయం పక్కనపెడితే బిజెపికి హిందు సంస్థలైన విహెచ్‌పి, భజరంగ్‌దల్, ఆరెస్సెస్ వంటి చెప్పుచేతల్లో ఉంటుందనే విమర్శ కూడా ఎప్పటినుంచో ఉంది. ఇక మోదీపై ఇప్పటికీ ముస్లింలకు 'గోద్రా' ఘటనపై మరక ఉంది. మరోవైపు బాబ్రీమసీద్ సంఘటనను ఏ ముస్లిం కూడా ఎన్నో ఏళ్ల తర్వాత కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక పెద్దగా ఓటు బ్యాంకులేని తమిళనాడులో 'మెర్సల్' విషయంలోనే హడావుడి చేసిన బిజెపి నాయకులు గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి తమకు పట్టువున్న ప్రాంతాలలో రాజ్‌పుత్ వంటి బిజెపి అనుకూల ఓట్లను దూరం చేసుకోవాలని బిజెపి భావించదు.
దీంతో ఇప్పుడు వివాదం తీవ్రంగా మారుతూ, హింసల దాకా వెళ్లిన 'పద్మావతి' చిత్రంలో రాణి పద్మావతిని చెడుగా చూపిస్తే బిజెపి ఎలాగూ ఒప్పుకోదు. కాబట్టే కర్ణిసేన నాయకులు దీపికాపడుకొనేని చంపి తేవాలని ముక్కు , చెవులు కోసేయాలని, సంజయ్ లీలా భన్సాలీని చంపాలని పిలుపునిస్తున్నారు. ఇంతకు ముందు ముస్లింలోనే తమ సంప్రదాయాలకు వ్యతిరేకంగా ప్రవర్తించే వారిపై హింస కోసం ఫత్వాలు జారీ చేసేవారు. ఇప్పుడు కర్ణిసేన నాయకులు దీపికా, భన్సాలీలను ఏ క్షత్రియ వ్యక్తి అయినా చంపితే 5కోట్లు నజరానా ఇస్తామని మీడియా ఎదుటే వార్నింగ్ ఇచ్చారు. ఇక ఈ విషయంలో తప్పు ఇరువైపులా ఉంది. ఈ చిత్రం పద్మావతిని తప్పుగా చూపించలేదని, ఆమె పాత్ర చేసినందుకు తాను గర్వపడుతున్నానని దీపికా స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఇందులో ఎవ్వరూ అభ్యంతరం వ్యక్తం చేసే సీన్స్ లేవని, ఆమె పాత్రను ఎంతో గొప్పగా చూపించామని భన్సాలీ అంటున్నాడు.
అయినా సినిమా విడుదల కాకుండానే, అందులో ఏముందో తెలుసుకోకుండానే రచ్చ చేయడం కర్ణిసేన తప్పు. ఇక ఆ వంశం వారిని, కర్ణిసేన రాజ్‌పుత్, క్షత్రియ వర్గాల ముఖ్యప్రతినిధులకు ముందుగా ఓ షో వేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. కానీ ఈ విషయంలో ఇరు వర్గాల నుంచి స్పందన లేదు. ఇక సంజయ్‌లీలా భన్సాలీ ఇంతకు ముందు చిత్రాలలో హిందువులను, చరిత్రను తప్పుదోవ పట్టించిన విషయం తెలిసిందే. దీంతో భన్సాలీపై అనుమానాలు వస్తున్నాయి. ఇక హిందు మతాన్ని, చరిత్రను తప్పుగా చూపించే వారు ముస్లింలతో సహా ఆ మతం వారిని కించపరిచేలా ఒక్క డైలాగ్ కూడా పెట్టలేరు అనేది కూడా వాస్తవం. ఇక తాజాగా ఈ చిత్రం సెన్సార్‌కి వెళ్లింది. అక్కడ ఈ సెన్సార్ అప్లికేషన్‌ని సరిగా పూర్తిచేయలేదని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల సెన్సార్ ఆ చిత్రాన్ని తిప్పిపంపింది. డిసెంబర్1న రిలీజ్. ఈ గొడవలు, వివాదాలు, సెన్సార్ వంటి వాటిని తప్పించుకుని ఈ చిత్రాన్ని థియేటర్లలో ప్రదర్శించడానికి ఎవరైనా ఒప్పుకుంటారా? అనేది చెప్పడం కూడా కష్టమే.