సినిమాస్టార్స్ తాము ఫేమ్‌లో ఉండగానే ఏదైనా వ్యాపారం మొదలుపెడితే వారికున్న క్రేజ్ మూలంగా ఈ బిజినెస్‌లు బాగానే లాభాలు తెస్తాయి. పబ్లిసిటీ కోసం వేరే వారిని అడుక్కోవడం, వయసు మీద పడి క్రేజ్ తగ్గిన తర్వాత వ్యాపారం మొదలు పెడితే అంతగా కలిసిరాదు. దాంతో మన స్టార్స్ క్రేజ్‌లో ఉండగానే నిర్మాతలుగా, పబ్‌లు, బార్స్, రెస్టారెంట్లు, జిబ్ సెంటర్లు, బేకరి వంటి వాటిలో అడుగుపెడుతున్నారు. ఇక నార్త్‌లో అయితే సల్మాన్‌ఖాన్, అనుష్కశర్మతో పాటు విరాట్ కోహ్లి, శ్రద్దాకపూర్, దీపాకా పడుకోనే వంటి వారు బ్రాండెడ్ దుస్తుల వ్యాపారంలో దూసుకుపోతున్నారు.
ఇక తెలుగులో రామ్‌చరణ్ నిర్మాతగా మారి సినిమాలు, డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్ వంటి వాటిని చేస్తున్నాడు. ఇక అల్లుఅర్జున్‌కి హీరోగా స్టార్‌డమ్ ఉంది. చేతిలో ఏకంగా గీతాఆర్ట్స్, గీతాఆర్ట్స్ 2, వి4 వంటి మూడు బేనర్లు ఉన్నాయి. ఇక కబడ్డీ, హాకీ, ఫుట్‌బాల్, వంటి లీగ్‌లలో కూడా జట్లను కొనుగోలు చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఆయనకు 800 జూబిలీ అనే పబ్ ఉంది. ఇటీవల అదే ప్రాంగణంలో కానోలి కేఫ్ అంటూ ఓ స్విస్ బేకరిని స్టార్ట్ చేశాడు.
తాజాగా ఆయన బీ-డబ్స్ అనే స్పోర్ట్స్ బార్‌లో భాగస్వామ్యం తీసుకుని, ఇన్వెస్టర్‌గా, పార్ట్‌నర్‌గా కూడా తన ఫొటోతోనే పోస్టర్ పబ్లిసిటీని కూడా చేశాడు. యూఎస్‌కి చెందిన బఫేలో వైల్డ్ వింగ్స్‌ని, ఇండియాలో బీ-పబ్స్‌గా ప్రారంభిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో దీనిని స్టార్ట్ చేశారు. సినిమాల చిరంజీవి కళను, బిజినెస్‌లో తన తండ్రి తెలివి తేటలను ఈయన పుణికిపుచ్చుకున్నాడని అంటున్నారు.