Advertisementt

2017 మూవీస్ జాతకం ఇదే..!

Sun 19th Nov 2017 08:58 PM
tollywood,movies,2017,hit track list  2017 మూవీస్ జాతకం ఇదే..!
2017 Movies Hit Track List 2017 మూవీస్ జాతకం ఇదే..!
Advertisement

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి సీజన్ లో ఏదో ఒక సినిమా హిట్ అయ్యి మంచి కలెక్షన్ తో ఆడుతుంది. అటు వసూళ్ల పరంగానే కాకుండా టాక్ పరంగా హిట్ అనిపించుకుంటుంది. కానీ ఇప్పుడు మాత్రం టాలీవుడ్ లో చాలా డల్ సీజన్ నడుస్తుంది. కానీ ఇప్పుడు నడుస్తున్న డల్ సీజన్ మాత్రం ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు. అసలు ఓపెన్ గా  చెప్పాలంటే అర్జున్ రెడ్డి, జై లవకుశ తర్వాత మళ్లీ అంతటి సాలిడ్ హిట్ ఒక్కటి కూడా టాలీవుడ్ ని తాకలేదు. 

ఈ ఏడాది ద్వితీయార్ధమైన జులైలో చెప్పుకోవడానికి సాయి పల్లవి - వరుణ్ తేజ్ జతగా తెరకెక్కిన ఫిదా సినిమా ఉంది. ఆగస్ట్ లో తాప్సి నటించిన ఆనందో బ్రహ్మ, విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాలున్నాయి. అలాగే సెప్టెంబర్ లో జై లవకుశ, మహానుభావుడు సినిమాలున్నాయి. కానీ నెక్స్ట్ అక్టోబర్ నుంచి మాత్రం మార్కెట్ పూర్తిగా పడిపోయింది. అక్టోబర్ లో నాగ్ - సమంత లీడ్ రోల్స్ లో నటించిన రాజుగారి గది 2 హిట్ అని ఊదరగొట్టారు. కానీ 3 రోజులకి ఆ సినిమా కెపాసిటీ అర్ధమయ్యి తర్వాత థియేటర్లన్నీ ఖాళీ. అలాగే రవితేజ రాజా ది గ్రేట్ కూడా కామెడీ ఎంటెర్టైనెర్ గా హిట్ అన్నారు. కానీ అనుకున్న కలెక్షన్స్ లేవు. ఇక రామ్ నటించిన ఉన్నది ఒకటే జిందగీ సూపర్ అన్నారు. కానీ రెండో రోజు నుంచే కలెక్షన్స్ లేవు.  ఇక తాజాగా నవంబర్ లో ఏంజెల్, కేరాఫ్ సూర్య సినిమాలు ఆడేస్తాయన్నారు. రెండూ పోయాయి. చివరికి హిట్ టాక్ తెచ్చుకున్న గరుడవేగ కూడా కలెక్షన్లు లేవు.

ఇక ఇప్పుడు ఈ వీకెండ్ లో విడుదలైన సినిమాల పరిస్థితి కూడా అంతే. డిటెక్టివ్, గృహం బాగుందన్నారు. కానీ డబ్బుల్లేవ్. వీటికంటే ముందొచ్చిన అదిరింది మూవీని కూడా అదిరిందన్నారు. అది కూడా మూణ్నాళ్ల ముచ్చటే అయింది. ఇక కార్తీ - రకుల్ ప్రీత్ నటించిన ఖాకి టాక్ సూపర్. మరి కలెక్షన్స్ ఏంటనేది ఒక వారం పోతేగాని తెలియదు. ఇక ఈ నెలలో చెప్పుకోదగ్గ సినిమాలు కూడా లేవు. అయితే  డిసెంబర్ లో నాని MCA, అఖిల్ హలో సినిమాలు మాత్రమే రేసులో ఉన్నాయి. ఈ ఏడాదికి అంతో ఇంతో గ్రాండ్ ఫినిషింగ్ టచ్ ఇవ్వాలనుకుంటే ఆ రెండు సినిమాలు హిట్ అవ్వాల్సిందే. అవి కూడా అటు ఇటైతే మాత్రం ఈ ఏడాది బాక్సాఫీస్ డల్ గా ముగియాల్సిందే. 

2017 Movies Hit Track List:

2017 Disappoint Year to Tollywood

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement