Advertisementt

డబ్బింగ్‌నే రీమేక్‌ చేసిన ఆయనకు ఇదో లెక్కా?

Sun 19th Nov 2017 05:08 PM
sharath marar,pawan kalyan,dubbing movies  డబ్బింగ్‌నే రీమేక్‌ చేసిన ఆయనకు ఇదో లెక్కా?
Sharath Marar Eye on Dubbing Movies డబ్బింగ్‌నే రీమేక్‌ చేసిన ఆయనకు ఇదో లెక్కా?
Advertisement

పవన్‌కళ్యాణ్‌కి ఉండే ప్రాణస్నేహితులను వేళ్ల మీద లెక్కించవచ్చని అంటారు. ఆయన కేవలం మనస్తత్వం నచ్చితేనే చేరనిస్తాడని పలువురు చెబుతుంటారు. ఇందులో అలీ, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌లతో పాటు నిర్మాత శరత్‌మరార్‌ కూడా నిన్నటివరకు ఉన్నాడు. కాగా ఆయన పవన్‌తో తీసింది రెండు చిత్రాలు. అది ఒకటి బాలీవుడ్‌ రీమేక్‌ 'గోపాలగోపాల' కాగా, రెండోది ఆల్‌రెడీ తమిళంలో విడుదలై తెలుగులో కూడా రిలీజ్‌ అయిన 'వీరం' రీమేక్‌. కానీ ఈ రెండు చిత్రాల విషయంలో 'గోపాల గోపాల' చిత్రం విషయంలో డి.సురేష్‌బాబు తప్పుడు లెక్కలు చూపించాడని, 'కాటమరాయుడు'తో శరత్‌మరార్‌ కూడా అదే ద్రోహం చేయడంతో ఆయన్ను పవన్‌ దూరంగా ఉంచుతున్నాడని వార్తలు వచ్చాయి. తాజా పరిణామాలను చూస్తూంటే ఈ విషయం నిజమేనని అర్ధమవుతోంది. ఇటీవలే తమిళ 'మెర్సల్' చిత్రం డబ్బింగ్‌ రైట్స్‌ని తీసుకుని 'అదిరింది' పేరుతో విడుదల చేశాడు. 

తమిళంలో రేగిన వివాదాలు, మీడియా కారణంగా, మరోవైపు బాగా పబ్లిసిటీ చేసి బాగానే కలెక్షన్లు సాధిస్తున్నాడు. ఇక తాజాగా ఆయన నయనతార తమిళంలో నటించిన 'ఆరమ్‌' చిత్రాన్ని కూడా ఫ్యాన్సీ రేటుకి కొన్ని తెలుగులో విజయశాంతి చిత్రం టైటిల్‌ అయిన 'కర్తవ్యం'గా డబ్బింగ్‌ చేస్తున్నాడు. ఈ చిత్రం తమిళనాట సంచలనం సృష్టిస్తోంది. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి 'మెర్సల్' చిత్రం కంటే ఎక్కువ పాజిటివ్‌ టాక్‌, కలెక్షన్లు, రివ్యూ రేటింగ్స్‌ వస్తున్నాయి. ఈ చిత్రం బాగా లేదని ఎవరు అనడం లేదు. తమిళంలో వచ్చిన అరుదైన చిత్రాలలో ఇది కూడా ఒకటని అంటున్నారు. ఎన్నోఏళ్లుగా తమిళంలో వస్తున్న దశాబ్దాల చరిత్ర కలిగిన 'ఆనంద విగటన్‌' సినిమా ఇప్పటివరకు భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన తమిళ 'పదహారేళ్ల వయసు' తమిళ మాతృక నుంచి ఇప్పటివరకు 100కి 50పైగా మార్కులను కేవలం 8 చిత్రాలకే ఇచ్చింది. అలాంటి హిస్టారికల్‌ మేగజైన్‌ ఈ చిత్రాన్ని 60 దాకా మార్కులని సంపాదించిన తొమ్మిదో చిత్రంగా నిలిచింది. 

ఇక ఈ చిత్రంతో పాటు శరత్‌మరార్‌ ఇక నుంచి వరుసగా డబ్బింగ్‌ చిత్రాలను రిలీజ్‌ చేయాలని భావిస్తున్నాడట. ఇక్కడ కూడా నయనతారకు ఉన్న క్రేజ్‌ వర్కౌట్‌ అవుతుందని ఫ్యాన్సీ ఆఫర్‌తో దక్కించుకున్న శరత్‌మరార్‌కి గతంలో వచ్చిన 'అనామిక' ఫలితం తెలిసే ఉండాలి. మొత్తానికి 'రాయుడు' అండలేకుండానే ఈయన 'కాటమరాయుడు' నుంచి 'డబ్బింగ్‌ రాయుడు' గా మారాడని సెటైర్లు వినిపిస్తున్నాయి.

Sharath Marar Eye on Dubbing Movies:

Pawan Kalyan Producers Hopes on Dubbing Movies

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement