ఏ సినిమా వేడుక జరిగినా, మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీ హీరోల ఫంక్షన్ ఏదైనా, పవన్ వచ్చినా రాకున్నా.. చీఫ్‌గెస్ట్ నుంచి సినీ నటీనటులు, దర్శకనిర్మాతలు ఎవరైనా సరే పవన్ గురించే మాట్లాడాలని పవన్ వీరాభిమానులు భావిస్తుంటారు. కానీ స్వయంగా మనసులోంచి వచ్చే మాటలు వేరు.. పవన్ అభిమానులు తమ హీరో గురించి మాట్లాడాలని గోల చేస్తూ దాదాపు బ్లాక్‌మెయిల్ చేసే స్థాయిలో అందరి నోటా పవన్ భజన ఉండాలని కోరుకోవడం వేరు. దీనిపై ఇప్పటికే నాగబాబు, బన్నీలు ఫైర్ అయ్యారు. ఇక వర్మ చిత్రం 'వంగవీటి' ఆడియోలో కూడా పవన్ అభిమానులు నానా రచ్చ చేశారు. దీంతో తమ చిత్రం గురించి చెప్పుకోకుండా పవన్ గురించే మాట్లాడాల్సి వస్తుంది. లేకుంటే బన్నీకి కత్తిమహేష్‌లకు ఎదురైన పరిస్థితులే ఎదురవుతాయి. మన పిల్లలు, మన తల్లిదండ్రులు, చివరికి కాకి పిల్ల కూడా కాకికి ముద్దే. అలాగే పవన్‌పై ఎవరిసొంత అభిప్రాయాలు వారికుంటాయి. కానీ బెదిరిస్తున్న ధోరణిలో ఆయన గురించి తప్పుగా మాట్లాడితే అంతు చూస్తాం.. చంపేస్తామని అనడం సరికాదు. పవన్ వ్యక్తిత్వం, వ్యక్తిగత జీవితం, ఆయన ఆలోచనలు, ఆయన సిద్దాంతాలు నచ్చేవారు ఉంటారు.. నచ్చని వారు కూడా ఉంటారు.
ఇక పవన్‌కి రేణుదేశాయ్‌లకు విడాకులు అయిపోయి పవన్ మూడో పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు కూడా తండ్రి అయ్యాడు. కానీ రేణుదేశాయ్ పెళ్లి చేసుకుంటానని చెప్పినా, పవన్ విడాకుల సమయంలో నాకేమీ ఇవ్వలేదని చెప్పినా కూడా పవన్ అభిమానులు చేసే బెదిరింపులు, పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తే ముక్కలు ముక్కలుగా నరుకుతాం అంటారు. దాంతో రేణుదేశాయ్ కూడా పవన్‌పై సాఫ్ట్‌కార్నర్‌లోనే మాట్లాడుతుంది. లేదా అసలు అతని గురించి టచ్ చేయకుండా ఉండాలని భావిస్తోంది. కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం ఏమి మాట్లాడినా కూడా దానిని రచ్చ రచ్చ చేస్తున్నారు. మరోపక్క పవన్ ఫ్యాన్స్‌ని, ఫాలోయింగ్‌ని క్యాష్ చేసుకోవాలని మీడియా కూడా మరోవైపు కాచుకుని ఉంటుంది.
ఆమె వద్దని చెప్పినా కూడా పవన్‌తో రిలేటెడ్ క్వశ్చన్స్‌నే వేస్తున్నారు. ఆమె నోరు జారకపోతుందా? పవన్ గురించి మాట్లాడకపోతుందా? వారి మద్య ఉన్న రహస్యాలను, విడాకుల కారణాలు మొదట తమకే చెప్పి టీఆర్పీలు పెంచుతుందని మీడియా ఆశ. చివరకు ఎబిఎన్ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో పవన్ గురించి ప్రశ్నలు అడగవద్దని, తన గురించే అడగాలని చెప్పినా ఆర్కే మాత్రం అన్ని పవన్ గురించే ప్రశ్నలు వేశాడని రేణుదేశాయ్ బాధపడుతూ ట్వీట్ చేసింది. పెద్ద పెద్ద మీడియాలు, అధినేతలే అలాంటి ప్రశ్నలు వేస్తే ఇక మామూలు మీడియాకి అది మరింత పెద్దవిషయమే. పవన్ గురించి అడగవద్దని రిక్వెస్ట్ చేసినా అలా ప్రశ్నలు వేయడం సరికాదనే చెప్పాలి.