మణిరత్నం మూవీలో నటించేది వీళ్లే..!

Maniratnam New Movie Casting Details

ఒక్కపుడు మణిరత్నం వేరు ఇప్పుడు మణిరత్నం వేరు. అప్పుడు వున్న ఫామ్‌ మణి ఇప్పుడు లేదు. ఓకే బంగారంతో  ఫామ్‌లోకి వచ్చి ఈ ఏడాదే చెలియా సినిమాతో మళ్ళీ ఫామ్‌ కోల్పోయాడు మణి. చెలియా సినిమా చూసి చాలా మంది ఇక మణి సినిమాలు తీయకపోవడం మంచిది అని కూడా అన్నారు. అయితే ఇవేవి పట్టించుకోని మణి ఒక భారీ కాంబినేషన్లో సినిమాకు రెడీ అయ్యాడు.

ఇప్పటికే ఈ సినిమాలో ప్రధాన నటీనటుల వివరాల్ని ప్రకటించారు. ఇప్పుడు ఎవరు ఏ పాత్ర చేసేది కూడా వెల్లడించడం విశేషం. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జయసుధ (భార్య భర్తలుగా) తల్లిదండ్రులుగా నటించబోతున్నారు. అరవింద్ స్వామి, శింబు, ఫాహద్ ఫాజిల్ వారి కొడుకులుగా నటించనున్నారట. ఇప్పుడిప్పుడే స్టార్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న విజయ్ సేతుపతి ఇందులో పోలీస్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో కనిపిస్తాడట. ఇక జ్యోతిక, ఐశ్వర్య, రాజేష్ హీరోయిన్ల పాత్రల్లో కనిపించనున్నారు.  

ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ కూడా జనవరి నుండి స్టార్ట్ అవుతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఆస్కార్ దిగ్గజం ఎ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సంతోష్ శివన్ ఛాయాగ్రహణం అందిస్తాడు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చేస్తున్నాడు. మణిరత్నం ఓన్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ సినిమాతో అయినా  పాత మణిని చూస్తామో లేదో చూడాలి.

Maniratnam Movie Artistes Role Revealed

maniratnam
artistes role
prakash raj
jayasudha