Advertisementt

అయ్యయ్యో... చేతిలో డబ్బులు పోయెనే!

Sun 19th Nov 2017 12:27 PM
srinivas reddy,stopped,rummy,card game  అయ్యయ్యో... చేతిలో డబ్బులు పోయెనే!
Comedian Srinivasa Reddy on Rummy Card Game అయ్యయ్యో... చేతిలో డబ్బులు పోయెనే!
Advertisement
Ads by CJ

వ్యసనాల విషయంలో ఇళ్లు గుల్ల చేసుకున్నవారు ఎందరో ఉన్నారు. ఇక బీడీ, సిగరెట్‌, మద్యం వంటి వాటిని పక్కనపెడితే చతుర్ముఖ పారాయణం అదేనండీ పేకాటలో సర్వం కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. అందుకే నాటి 'కులగోత్రాలు' చిత్రం రమణారెడ్డి, ఇతరులపై 'అయ్యయ్యో.. చేతిలో డబ్బులు పోయెనే..జేబులు ఖాళీ ఆయనే'.. అంటూ సెటైరిక్‌ సాంగ్‌ వచ్చింది. ఆ తర్వాత శోభన్‌బాబు, సుమన్‌ నటించిన 'దోషి నిర్ధోషి' చిత్రంలో కూడా పేకాటపై పాట ఉంది. ఇక 'పేకాట పాపారావు' పేరుతో ఎన్నో క్యారెక్టర్లు ఉన్నాయి. ఇలా పేకాటలో డబ్బులు పోగొట్టుకున్న వారిలో కమెడియన్‌ కమ్‌ హీరో శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నాడు. 

ఆయన తాను పేకాటలో బాగా సంపాదించానని, బాగా పోగేశానని భావించేవాడట. కానీ చివరకు లెక్కలు చూస్తే నష్టమే మిగిలిందని తేలింది. తనకు పాత్రల కోసం కూడా తిరగకుండా షూటింగ్‌ లేదు కాబట్టి ఆ రోజంతా పేకాట ఆడేవాడట. నా లైఫ్‌ ఏంటి? అవకాశాలు రాకపోవడం ఏమిటి? అనే ఆలోచనే ఉందేడి కాదని తెలిపాడు. ఇక ఈయనకి తోడు దొరికితే సినిమా షూటింగ్‌ గ్యాప్‌లో కూడా రెండు మూడు రౌండ్లు వేసేవాడు. ఈ విషయం తెలిసి అమ్మ ఎంతో బాధపడింది. దాంతో పేకాట మానేశాను. కెరీర్‌ ఎదిగే కొద్ది మానేసాను. నేను ఈ అలవాటు మానేయడానికి మా అమ్మకారణం అంటున్నాడు.

Comedian Srinivasa Reddy on Rummy Card Game:

Srinivas Reddy Stopped Rummy Card Game For His Mother

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ