సినిమా వారు కూడా రాజకీయనాయకులకు మించిన వారు. ఎవరితో చిత్రం చేస్తుంటే వారికి భజన చేయడం, ఇతర హీరోల భజన కూడా కేవలం ఏదో పరిశ్రమని ఉద్దరిద్దామని కాదు.. కేవలం అవకాశ వాదమే. ఇక ఇటీవల ఏపీ ప్రభుత్వం మూడు సంవత్సరాలకు కలిపి ఓకేసారి అవార్డులను పెంచింది. ఇంతకాలం నాగ్, బాలయ్యల మధ్య ఏమీ లేదని వాదించేవారికి, సినీ పరిశ్రమ కులజాడ్యం నడుస్తోందంటే కాదని వాదించే వారే ఇప్పుడు రోడ్డున పడుతున్నారు. ఇక ఈ అవార్డులలో 'లెజెండ్'కి అన్ని అవార్డులు ఇవ్వడం మీదనే చర్చ నడుస్తోంది. నిజానికి ఈ అవార్డులలో అన్యాయం జరిగింది ముగ్గురు, నలుగురికి మాత్రమే. 'మనం' చిత్రానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం, ఈ చిత్రానికి ఇచ్చి అవార్డులో కూడా కుటుంబ కధా చిత్రం అనే ప్లేస్‌లో 'కుటుంబం' అనేది తీసివేయడం, లెజండరీ నటుడైన ఏయన్నార్ చివరి చిత్రానికి ఆయనకు అవార్డు ఇవ్వకపోవడం, 'ఎన్నో అప్పులు సొప్పులు చేసి సినిమా మీద ప్యాషన్‌తో ఇతర నిర్మాతలను రిస్క్‌లో పెట్టడం ఇష్టంలేక, బన్నీని ఫ్రీగా నటించాలని బతిమాలి, ఓ తెలుగు జాతి వీరనారి బయోపిక్ అయిన 'రుద్రమదేవి'కి తీవ్ర అన్యాయం జరిగింది.
ఇక అల్లుఅర్జున్‌కి క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇచ్చే బదులు అది కూడా ఇవ్వకపోవడమే బాగుండేది. అలాగని 'రేసుగుర్రం'కి ఉత్తమ చిత్రంగా అవార్డు ఇవ్వాలనే వాదన తప్పు. 'లెజెండ్'లాంటి చిత్రమే ఈ 'రేసుగుర్రం' కూడా. కేవలం పక్కా కమర్షియల్ చిత్రం. ఇక విషయానికి వస్తే అవార్డులకు తమ సినిమాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు.. ఏ అర్హతలు ఆ చిత్రాలకు లేవు అని నిర్ణయించే అవార్డు కమిటీ మెంబర్స్ వారికి ఉన్న అర్హతలేమిటో తెలియాలి. మద్దినేన రమేష్‌బాబు, ప్రసన్నకుమార్ వంటి వారికి ఉన్న అర్హతలేంటి? అనేది కూడా అందరికీ తెలియాలి. ఇక వర్మ నంది అవార్డు సభ్యులకు ఆస్కార్ ఇవ్వాలని ఎద్దేవా చేయడం, ఆ తర్వాత పలువురు అవార్డులపై విమర్శిస్తున్న నేపధ్యంలో మద్దినేని రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అవార్డులపైనే కాదు.. ఏ విషయం మీదనైనా చర్చించి, ప్రశ్నించే హక్కు మన ప్రజాస్వామ్యం దేశంలో ఉంది. కానీ వర్మపై మద్దినేని మాట్లాడుతూ, తెలుగులో తీయడం చేతకాక, ముంబై వెళ్లి, అక్కడి మాఫియా బెదిరింపులకు భయపడి తెలుగుకి వచ్చిన నీవా ప్రశ్నించేది? అనడంతో పాటు వర్మని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సమంజసం కాదు. కుటుంబ వ్యవస్థని, సమాజం పట్ల బాధ్యతేలేని నువ్వు నాడు ఎన్టీఆర్ చేతులు మీదుగా అవార్డు తీసుకున్నప్పుడు ఆ కమిటీపై నీకు అనుమానం రాలేదా? బఫూన్లుగాళ్లు, బక్కగాళ్లకి, బలుసు గాళ్లకి, బలుపు గాళ్లకి ఇక్కడ ఎవ్వరూ భయపడరు. అంటూ టార్గెట్ చేశాడు.
దానికి వర్మ ప్రజాస్వామ్యం దేశంలో ఉన్నామని, అన్నం మెతుకు చూస్తేనే దాని సంగతి అర్ధమవుతుందని, ఇక మెతుకువంటి మద్దినేనిని చూస్తే మిగతా అవార్డు మెంబర్ల అన్నం గురించి తెలుస్తోందని సెటైర్ వేశాడు. ఇక ఎన్ని ఎవరు చెప్పినా, సూక్తులు చెప్పినా సినిమా ఇండస్ట్రీ రెండు వర్గాల చేతిలోనే నడుస్తోందని, వారు పైకి నవ్వుతూ నీతులు చెబుతారే గానీ ఈ రెండు కులాల గుప్పిట్లోనే ఇండస్ట్రీ నలిగిపోయి బజారున పడుతోందని ఈ వ్యవహారం నిరూపిస్తోంది. అందరు ఈ రెండు కులాల మధ్య విషయాలనే మాట్లాడుతున్నారు గానీ ఈ రెండు కులాలకు చెందని ప్రభాస్‌కి జరిగిన అన్యాయంపై మాత్రం అడిగే వాడే లేకుండా పోయాడు...!