ఒకరేమో కేవలం జనాలు చూడని, అవార్డుల కోసం తీసే చిత్రాలకే అవార్డులు ఇస్తారని, కానీ కమర్షియల్‌గా హిట్ అయిన చిత్రాలకు అవార్డులు ఎందుకివ్వకూడదు? అని గతంలో చాలా మంది ప్రశ్నించేవారు. దీంతో ఎంతో కొంత కంటెంట్, కమర్షియల్ హిట్ చిత్రాలకు కూడా అవార్డులు ఇస్తున్నారు. అదేమంటే అంతర్లీనంగా సందేశం ఉంది అని చెబుతారు. ఆ విషయానికి వస్తే హింసను, శృంగారాన్ని సినిమా మొత్తం చూపి చివరలో విలన్స్ మీద హీరోలు గెలిచి, దుష్టశిక్షణ, శిష్టరక్షణ అనేది ప్రతి కమర్షియల్ చిత్రంలో ఉండేది. సినిమా అంతా శృంగార, హింస చూపి చివరలో హింస మంచిది కాదని, విచ్చలవిడి శృంగారం చేస్తే రోగాలు వస్తాయని, ఎయిడ్స్ వస్తుందని చెప్పినంత మాత్రాన అది సందేశాత్మక చిత్రం అవుతుందా?
ఇక ఇదే విషయమై తాజాగా నంది అవార్డుల వేడుకలో విప్లవవీరుడు, పీపుల్స్‌స్టార్ ఆర్. నారాయణ మూర్తి స్పందించారు. ఒకప్పుడు సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ విలువలు, మానవ సంబంధాల మీద మంచి మెసేజ్‌తో వచ్చే చిత్రాలకే అవార్డులు ఇచ్చారు. కానీ నేడు రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలతో అవార్డులని ఇస్తోంది. ఓ పోరాట యోధురాలు, వీరవనిత, తెలుగుజాతి పౌరుషానికి ప్రతీక అయిన 'రుద్రమదేవి' చిత్రానికి ఏ అవార్డులు ఇవ్వకపోవడం దారుణమని తెలిపాడు. అలాంటి చిత్రాలు తీయాలంటే అది సామాన్యమైన పని కాదు. దానిని ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంది.
ఇక ఎలాంటి సందేశాలు ఏమీ లేని ఓ కల్పిత గాధ, అదేమీ చరిత్ర కాదు. పూర్తికమర్షియల్ చిత్రమైన 'బాహుబలి'కి అవార్డు ఇవ్వడంతోనే నాకు విషయం అర్ధమైంది. ఆ చిత్రాన్ని ఉన్నత సాంకేతిక విలువలో ప్రపంచాన్ని మనవైపు చూసేలా తీసిన రాజమౌళికి హ్యాట్సాఫ్ కానీ ఆ చిత్రానికి అవార్డు ఇవ్వడం సమంజసం కాదని అన్నాడు. ఇక మరికొందరు మాత్రం 'బాహుబలి' చిత్రానికి మాత్రమే అవార్డు ఇచ్చి ప్రభాస్‌కి అవార్డు ఇవ్వకపోవడం వెనుక అసలు కారణాలు ఏమిటి? అని నిలదీస్తున్నారు. ఈ అవార్డులను ఇస్తున్నారా? పంచుతున్నారా? అని పలువురు స్పందిస్తున్నారు.