Advertisementt

సల్మాన్ - కత్రినా రొమాన్స్ చూడాలనివుందా?

Fri 17th Nov 2017 11:35 PM
salman khan,katrina kaif,tiger zinda hai,romance song  సల్మాన్ - కత్రినా రొమాన్స్ చూడాలనివుందా?
Salman and Katrina acted Tiger Zinda Hai Movie Song Released సల్మాన్ - కత్రినా రొమాన్స్ చూడాలనివుందా?
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో సూపర్బ్ జంటల్లో మనకి ముందు గుర్తొచ్చేది సల్మాన్ ఖాన్ - కత్రినా కైఫ్. వీళ్ల గురించి ప్రత్యేకించి చెప్పనవసర్లేదు.. వీరిద్దరూ కలిసి నటించిన ఏక్ థా టైగర్ సినిమానే చెబుతుంది వీళ్ల కెమిస్ట్రీ ఏంటో. ఈ సినిమాలో వీళ్లు 'మాషాఅల్లా...' పాటలో అయితే.. ఇద్దరూ కలిసి ఇరగదీసేశారు. ఈ పాట అప్పట్లో ట్రెండ్ సెట్ అయింది.

మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఈ జంట కలిసి నటించిన చిత్రం 'టైగర్ జిందా హై'. ఈ ఏడాది 'ట్యూబ్ లైట్' తో డీలా పడ్డ సల్మాన్ మళ్ళీ 'టైగర్ జిందా హై' మూవీతో ఫుల్ స్వింగ్ లోకి వచ్చేలా వున్నాడు. డిసెంబర్ 22 న వస్తున్న ఈ సినిమా ప్రొమోషన్స్ లో బిజీగా వుంది. అయితే ఈ చిత్రంకి సంబంధించి ఓ పాటని రిలీజ్ చేయబోతున్నారు చిత్ర యూనిట్. 'స్వాగ్ సే కరేంగ్ సబ్ కా స్వాగత్' అంటూ సాగే పాటను విడుదల చేస్తున్నారు. అయితే ఈ పాటలో సల్మాన్ ఖాన్ - కత్రినా కైఫ్ కెమిస్ట్రీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుందట.

ఈ పాట కోసం సల్లూ భాయ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్ర దర్శకుడు ఆలీ అబ్బాస్ జాఫర్.... 'ఈ పాట కోసం ఫ్యాన్స్ ఎంత ఉత్సాహంగా ఉన్నారో తెలుసు. అందరి అంచనాలను అందుకునేలా ఈ పాటను చిత్రీకరించాం. సల్మాన్ - కత్రినాల కెమిస్ట్రీ అదిరిపోయే లెవల్లో ఉంటుంది....ఈ పాటలోని లొకేషన్స్.. స్టైలింగ్ కూడా ఆకట్టుకుంటాయి' అని అంటున్నాడు.

Salman and Katrina acted Tiger Zinda Hai Movie Song Released:

Romance between Salaman and Katrina in tiger zinda hai Movie Song

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ