'ఉయ్యాల జంపాల' సినిమా తర్వాత హీరో రాజ్ తరుణ్ మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏ సినిమా చేయలేదు. అయితే ప్రస్తుతం రాజ్ తరుణ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో తమిళ్ డైరెక్టర్ రాగిణి డైరెక్షన్ లో రాజ్ తరుణ్ నటిస్తున్నాడు. నిర్మాత నాగ్ కూడా రాజ్ తరుణ్ తో తక్కువ బడ్జెట్ లో సినిమా తీయొచ్చని భావించి షూటింగ్ స్టార్ట్ చేశాడు. కానీ విషయం ఏటంటే..
ఈ సినిమా ఫస్ట్ కాపీకే నాలుగుకోట్ల దగ్గర దగ్గర అయిందని వినికిడి. ఈ ఫస్ట్ కాపీలోనే మూడు నాలుగు మ్యారేజ్ ఎపిసోడ్ లు ఉండటం వల్ల ఇంత ఖర్చు అయిందని తెలుస్తుంది. పైగా నాగార్జున కూడా 'సోగ్గాడే చిన్నినాయనా', 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాల్లో ఆ కలర్ ఫుల్ లుక్ వుంటే ఎలా వుంటుందో అలా ఈ సినిమా కూడా తీయాలని..డబ్బులు గురించి ఆలోచించొద్దని చిత్ర టీంకి చెప్పాడంట.
సినిమాకి ఎంత డబ్బైనా ఖర్చుపెటవచ్చు కానీ.. ఇప్పుడే నాలుగు కోట్లు అయిందంటే సినిమా మొత్తం అయ్యే సరికి ఎంత అవుతుందో... మరి అంత మార్కెట్ రాజ్ తరుణ్ కి ఉందా? ఉంటే ఒకవేళ ఈ సినిమాను నాగ్ బయర్స్ కు ఎలా అమ్ముతాడో చూడాలి!