మిస్ ఫెమినా సౌత్ కిరీటాన్ని దక్కించుకుని మోడలింగ్‌లో దూసుకు పోతున్న మోడల్ మీరామిధున్. మోడలింగ్‌లో రాణించిన ఈ బ్యూటీ ఇటీవల '8తూట్టాకల్'తో తమిళ తెరకు పరిచయమైంది. ఈమెకు ఈ మూవీతో మంచి పేరే వచ్చింది. కాగా ఈ చిత్రం చూసిన తర్వాత ఓ స్టార్ హీరో తన చిత్రంలో ఈమెకి అవకాశం ఇప్పిచాడు. ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మంచి స్టార్‌డమ్ ఉన్న సూర్య ఇటీవల వరుస ఫ్లాఫ్‌లతో ఇబ్బందులు పడుతున్నాడు. ఈయన నటంచిన '24' చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నంతగా తమిళ తంబీలను ఆకట్టుకోలేదు. 'ఎస్ 3' చిత్రం కూడా ఆయన్ను కాపాడలేదు. ప్రస్తుతం ఆయన హీరోయిన్ నయనతారతో ఎఫైర్ నడుపుతున్నాడని వార్తల్లో నిలుస్తోన్న విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం పేరు 'తానా సేర్న్‌ద కూటం'.
ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్‌గా కీర్తిసురేష్ నటిస్తుండగా, మరో పాత్రకు మీరామిథున్‌ని ఎంపిక చేశారు. ఈ విషయాన్నే ఆమె చెబుతూ, ఈ చిత్రంలో నాకు అవకాశం రావడానికి '8తూట్టాకల్' చిత్రమే కారణం, రెండో చిత్రమే సూర్య వంటి స్టార్‌తో చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో నా పాత్ర ఏమిటనేది ఇప్పుడు చెప్పను. ఈ పాత్ర ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని చెబుతోంది. కాగా కీర్తిసురేష్ హీరోయిన్ అంటే ఆమె ఎలాగూ గ్లామర్‌షో చేయదు. దాంతో పవన్-త్రివిక్రమ్‌లు అను ఇమ్మాన్యుయేల్‌ని పెట్టుకున్నట్లుగా గ్లామర్ పాత్ర కోసం మరో ముద్దుగుమ్మ స్టార్ హీరోలకు అవసరం. దాంతో ఈమె ఇంత బిల్డప్ ఇస్తోంది కానీ ఆమె చేసేది సెకండ్ హీరోయిన్‌గా గ్లామర్ షో చూపించే పాత్రేనని పలువురు అనుకుంటున్నారు.