చాలామందికి ముక్కలేందే ముద్దదిగదు. ఉదయం దోసెల నుంచి మధ్యాహ్నం, సాయంత్రం, మందు పార్టీలు ఇలా ఏది ఎలాగున్నా ముక్కాగిక్కా లేనిదే వారికి కిక్ ఉండదు. ఇక ప్రస్తుతం బాలీవుడ్ నటి శ్రద్దాకపూర్.. ప్రభాస్ 'సాహో' చిత్రంలో నటిస్తోంది. ఇటీవలే ప్రభాస్ అండ్ కో ఈమెకి పీతలు, రొయ్యలు, చేపలు, మటన్, చికెన్ వంటి 25కి పైగా నాన్‌వెజ్ వంటకాలని పెట్టి విందు చేశారు. ఆ ఫోటోలను ఈ అమ్మడు ట్విట్టర్‌లో కూడా పెట్టింది. ఇప్పుడే కాదు. ఆమెకి మొదటి నుంచి ముక్క అంటే ఎంతో ఇష్టమట. కానీ ఈ అమ్మడి ట్విట్టర్ ఫోటోలు చూసి కాబోలు పెటా (జంతు సంరక్షణ సంస్థ) కేవలం వెజిటేరియన్‌లో ఎన్ని రుచికరమైన వంటకాలు ఉన్నాయో? వాటి రుచి ముందు నాన్‌వెజ్, ముక్కాగిక్కా కూడా సాటి రావని ఓ రెసిపీలతో ఓ పుస్తకాన్ని శ్రద్దాకపూర్‌కి పంపారట.
దాంతో ఆమె మనసు మారి ఆ పుస్తకంలోని వెజిటేరియన్ రుచులనే తినాలని, అంతే గానీ ఇక జంతువులను చంపి నాన్‌వెజ్ తినకూడదనే నిర్ణయానికి వచ్చింది. కానీ అమ్మడు దీనికి కాస్త టైం కావాలంటోంది. న్యూఇయర్ ప్రారంభం నుంచి నో నాన్‌వెజ్.. ఓన్లీ వెజ్ అంటోంది. అయినా మంచిపనికి కూడా న్యూఇయర్‌ని టార్గెట్‌గా పెట్టుకుని అప్పటివరకు ఆగడం ఎందుకో మరి...! జిహ్వచాపల్యం అలాంటిది. ఓ చెడు అలవాటుని మానుకోవాలంటే అంత ఈజీగా మానలేరు కదా...! అందుకే న్యూఇయర్‌ని టార్గెట్ చేసుకుని చిన్నచిన్నగా నాన్‌వెజ్‌ని దూరం పెడుతోందన్నమాట...!