పూరీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన లోఫర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ భామ దిశా పటాని. బాలీవుడ్ లో ఓ... అన్నంత సినిమాల్లో నటించకపోయినా... హాట్ మోడల్ గా హాట్ టాపిక్ అయ్యింది. దిశా పటానికి సోషల్ మీడియాలో లెక్కలేనన్ని ఫాలోవర్లు ఉన్నారు. ఎప్పుడూ ఏదో ఒక హాట్ ఫోటో షూట్ తో హడావిడి చేసే ఈ భామ గ్లామర్ పరంగా రెచ్చిపోయింది. బికినీ షో చేసిన కాస్త పర్లేదనిపించే దుస్తుల్లో దర్శనమిచ్చే దిశా ఇప్పుడు మాత్రం పిచ్చెక్కించే షాట్ తో ప్రేక్షకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. హాట్ హాట్ గా మాక్సిమ్ కోసం మాగ్జిమమ్ అందాలు ఆరబోసేసింది ఈ అమ్మడు.
మరి అలాంటి హాట్ ఫోటో షూట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దిశా ఫొటోస్ చూసి కుర్రకారుకు మతులు పోతున్నాయి. దిశా అందాలని తనివితీరా జుర్రుకునే వారితో పాటే... దిశా ఫొటోస్ చూసిన కొంతమంది దిశా కాస్త తగ్గమ్మ అనే కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారట. మరీ ఇంత ఎక్స్ పోజింగ్ వద్దులే అంటూనే... అందం ఎంత దాచుకుంటే అంత బావుంటుంది.. ఇలా చూపెట్టేస్తే ఏం బావుంటుంది అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.
అయినా ఎంతమంది ఎన్ననుకుంటేనేం ఈ భామలు తమ పని తాము చేసుకుపోతారు. అంతేకాని ఎవరో తగ్గించమన్నారని.. తగ్గించరు. మరి దిశా కూడా సినిమాలపై ఫోకస్ పెట్టి ఈ హాట్ నెస్ కి కొంచెం గ్యాప్ ఇస్తే మంచిదేమో.. లేకుంటే ఏదో అరకొరగా సినిమాల తో నెట్టుకొస్తూ ఇలా హాట్ ఫోటో షూట్స్ తో కాలం గడిపెయ్యాల్సి వస్తుంది. ఏదైనా ఆలోచించుకోవాలి మరి.