తాజాగా మూడేళ్లకు సంబంధించిన సినిమాలకి నంది అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ మూడేళ్లలో మెగా ఫ్యామిలీ హీరోలు ఎన్నోసూపర్‌హిట్స్ ఇచ్చారు. అయినా వారికి ఉత్తమ నటులుగా అవార్డులు లభించలేదని, ఇది బాలయ్య చెప్పినట్లు ఇచ్చిన అవార్డులుగా ఉన్నాయని కొందరు అంటున్నారు. మరోవైపు ఇవి నంది అవార్డ్సు లాగా లేవు.. ఇవి సైకిల్ పార్టీ ఇచ్చిన సైకిల్ అవార్డ్సు అని బండ్లగణేష్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడే కాదు ఇప్పుడు టిడిపి హయాంతో పాటు ఎన్నో ఏళ్లుగా అవార్డుల విషయంలో మెగా ఫ్యామిలీకి అవమానం జరుగుతోందని, 'లెజెండ్' బ్లాక్‌బస్టరే కావచ్చు.. నా 'గోవిందుడు అందరివాడేలే' చిత్రంలో రామ్‌చరణ్ గొప్పగా నటించాడు.
దీనికి ఉత్తమ కుటుంబకధా చిత్రంగా అవార్డుని ఇవ్వకుండా ఏదో కథ బాగుందని ఓ అవార్డు, చిరంజీవి కోసం నామమాత్రంగా రఘుపతి వెంకయ్య అవార్డులు ఇచ్చారని మండిపడ్డాడు. మరోవైపు బన్నీ అభిమానులు కూడా తమ హీరోని నిర్లక్ష్యం చేశారని, ఆయన నటించిన సూపర్‌హిట్స్‌ని పట్టించుకోలేదని, ఇక బన్నీకి ఉత్తమ సహాయనటుడు అవార్డుని ఇవ్వకుండా ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు ఇవ్వడంపై మండిపడుతున్నారు. ఇక గీతాఆర్స్ సంస్థలో కీలకమైన బన్నీవాసు మాట్లాడుతూ, నేను మెగా ఫ్యామిలీ తరపున మాట్లాడటం లేదు. వారు ఆ విషయాలను పట్టించుకోవడం కూడా లేదు. కానీ అవార్దుల విషయంలో మెగా ఫ్యామిలీ హీరోలకు అన్యాయం జరుగుతోంది. కేవలం ఈమూడు ఏళ్లలోనే కాదు.. ఎంతోకాలంగా మెగా ఫ్యామిలీకి అన్యాయం జరుగుతుండటంతోనే తాను మాట్లాడుతున్నానని విమర్శలు చేశాడు.
ఇక సినీ ఇండస్ట్రీలో 50శాతం మెగాఫ్యామిలీ హీరోల నుంచే రెవిన్యూ వస్తోన్న విషయాన్ని అందరు మర్చిపోతూ అన్యాయం చేస్తున్నారని అన్నాడు. అయినా మెగా ఫ్యామిలీ అనుమతి లేకుండా బన్నీవాసు ఇలాంటి వ్యాఖ్యలు చేసేవాడా? అనే సందేహం మాత్రం ఖచ్చితంగా వస్తుంది.