Advertisementt

వర్మ ఏంటి అంత మాట అనేశాడు!

Thu 16th Nov 2017 06:28 PM
akhil akkineni,hello,ram gopal varma  వర్మ ఏంటి అంత మాట అనేశాడు!
RGV on Akhil's Hello poster వర్మ ఏంటి అంత మాట అనేశాడు!
Advertisement
Ads by CJ

అఖిల్ అక్కినేని ప్రస్తుతం 'హలో' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి మనం లాంటి బ్లాక్ బస్టర్ అందించిన విక్రమ్ కే కుమార్ దర్శకత్వం చేస్తున్నాడు. అఖిల్ సరసన కళ్యాణి హీరోయిన్‎గా నటిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాకి అక్కినేని  ఫ్యామిలీకి ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ సంగీతం స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి.

అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక పోస్టర్ విడుదల చేసింది చిత్ర బృందం. ఆ పోస్టర్ లో నవంబర్ 16న టీజర్, డిసెంబర్ 22న సినిమా అని వుంది. ఇది ఇలా ఉండగా లేటెస్ట్ గా హలో సినిమా పోస్టర్ విడుదల కాగానే పలువురు సినీ ప్రముఖుల నుండి ప్రశంసలు పొందింది. ఈ లుక్ చూసిన విలక్షణ దర్శకుడు తనదైన శైలిలో స్పందిస్తూ సోషల్ మీడియాలో  స్పందించాడు.

తనకు ఎవరన్నా నచ్చకపోతే ఆ సినిమా గురించి చాలా బ్యాడ్ గా పోస్ట్స్ చేస్తుంటాడు రామ్ గోపాల్ వర్మ. అలానే తనకి ఎవరన్నా నచ్చితే మాత్రం ఆ సినిమాను..ఆ సినిమాలో ఆర్టిస్ట్స్ లను తెగ పొగడ్తలతో ముంచెత్తుతాడు... తన ట్వీట్స్ ద్వారా. అదేవిధంగా పోస్టర్ లో అఖిల్ లుక్ పై కూడా ఇలా పోస్ట్ చేసాడు..'పోస్టర్ ఆధ్బుతంగా.. మతిపోగొట్టేలా ఉంది. ఈ సినిమా అఖిల్ జీవితంలో నిజమైన తొలి చిత్రం కాబోతుంది' అని పేర్కొంటూ 'హలో' సినిమా ఫస్ట్‎లుక్ పోస్టర్ జత చేశాడు వర్మ. అయితే ఆయన చేసిన ఈ పోస్ట్ పై విపరీతంగా కామెంట్స్ వచ్చి పడుతుండటం విశేషం.

RGV on Akhil's Hello poster:

Maverick director Ram Gopal Varma looking at the poster commented, \"HELLO! This is a MOTHER FUCKING MINDBLOWING POSTER\'.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ