Advertisementt

మోస్ట్‌ సీనియర్‌ బ్యాచులర్‌ కామెంట్స్‌ ఇవి!

Thu 16th Nov 2017 12:37 PM
salman khan,marriage,bollywood actor  మోస్ట్‌ సీనియర్‌ బ్యాచులర్‌ కామెంట్స్‌ ఇవి!
Salman Khan Comments on Marriage మోస్ట్‌ సీనియర్‌ బ్యాచులర్‌ కామెంట్స్‌ ఇవి!
Advertisement
Ads by CJ

సహజంగా మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్స్‌ ఉండవచ్చు గానీ ఈ విషయంలో సల్మాన్‌ ఖాన్‌ది డిఫరెంట్‌ రూట్‌. ఆయన 50 దాటి పోయినా కూడా ఇప్పటికీ పెళ్లి అంటే చూద్దాం అంటాడు. ఐశ్వర్యారాయ్‌, కత్రినా కైఫ్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ వంటి వారితో ఎఫైర్లు నడిపిన ఆయన రోమేనియా మోడల్‌ ఇలియా వాంటూర్‌తో సహజీవనం చేస్తున్నాడు. ఇక ఆయనకి ఎక్కడికి వెళ్లినా మీ పెళ్లెప్పుడు అనే ప్రశ్నలే ఎదురవుతాయి. 

తాజాగా ఆయన ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. నా పెళ్లి గురించి ప్రజలు ఇంత ఎగ్జైటింగ్‌గా ఉన్నారంటే నాకు కూడా ఆనందమే. కానీ నా పెళ్లి వల్ల వారికేం ప్రయోజనం వస్తుందో మాత్రం అర్ధం కావడం లేదు. ఈ ప్రశ్నకు నా వద్ద సమాధానం లేదు. అవునని గానీ, లేదని కానీ తెలియదని గానీ చెప్పలేను. జరగాల్సి ఉంటే జరుగుతుంది. లేదంటే లేదు ఎదేమైనా నేను సంతోషంగా ఉన్నాను...అని చెప్పుకొచ్చాడు. 

ఇక ఆయన గతంలో తనకు పిల్లలంటే ఎంతో ఇష్టమని, కానీ పిల్లలు కావాలంటే వారితో పాటు తల్లి కూడా వస్తుందని, కాబట్టి అలా కాకుండా ఉపాయం చెప్పమని అన్నాడు. దాంతో ఆయన సరోగసీ పద్దతి ద్వారా తండ్రి అవుతాడేమోనని ప్రచారం జరిగింది. ఆ మద్య తాను హజ్బెండ్‌ మెటీరియల్‌ని కాదని, కానీ పిల్లలంటే మాత్రం బాగా ఇష్టపడతానని చెప్పడంతో కూడా పలు వార్తలు ఆయనపై వచ్చాయి. 

Salman Khan Comments on Marriage:

Salman Khan Talks ABout His Marriage

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ