Advertisementt

కమల్ ఫేవరేట్‌ స్టార్స్‌ ఎవరో తెలుసా?

Thu 16th Nov 2017 11:56 AM
big,kamal haasan,kajol,kajal agarwal  కమల్ ఫేవరేట్‌ స్టార్స్‌ ఎవరో తెలుసా?
Kamal Haasan Revealed His Favorite Stars కమల్ ఫేవరేట్‌ స్టార్స్‌ ఎవరో తెలుసా?
Advertisement
Ads by CJ

కమల్‌హాసన్‌ని వ్యక్తిగత విషయాలలో ఎవరైనా విమర్శించవచ్చు గానీ నటునిగా మాత్రం ఆయనపై వేలెత్తి చూపే సాహసం ఇండియాలోనే ఎవ్వరూ చేయలేరు. రజనీకాంత్‌, చిరంజీవి.. ఇలా ఎందరు ఉన్నా కమల్‌ స్థానం ఆయనకు తప్పితే మరెవ్వరికీ దక్కదు. ఆ కోవలోకి ఇప్పుడిప్పుడే అమీర్‌ఖాన్‌ వంటి వారు వస్తున్నారు. ఇక త్వరలో కమల్‌ తాను తీసిన 'విశ్వరూపం2' ట్రైలర్‌ని రిలీజ్‌ చేసి సినిమాని కూడా త్వరలోనే విడుదల చేయాలని భావిస్తున్నాడట. ఇక ఆయన తన కుమార్తె శృతిహాసన్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందంలు కలిసి నటిస్తూ ఆయనే నిర్మాత, దర్శకునిగా పనిచేస్తున్న 'శభాష్‌ నాయుడు' గురించి మాత్రం అప్‌డేట్‌ లేదు. 

ఇక త్వరలో ఆయన 'భారతీయుడు2'గా రానున్నాడు. అలాంటి లోకనాయకుడే.. తాను ఇష్టపడే స్టార్స్‌ ఎవరో రివీల్‌ చేశాడు. బిగ్‌బి అమితాబ్‌, సీనియర్‌ హీరోయిన్‌ కాజోల్‌లు తనకిష్టమని ఆయన ట్వీట్‌ చేశాడు. ఇటీవల ఆయన అమితాబ్‌, కాజోల్‌తో దిగిన ఫోటోని పోస్ట్‌ చేశాడు. 'ఇద్దరు లెజెండ్స్‌తో సెల్ఫీ.. కాదని అనలేం' అంటూ ట్వీట్‌ చేశాడు. తాను సెల్ఫీలకు ఫ్యాన్‌ని కాదని, కానీ ఈ ఫోటోలో ఉన్న ఇద్దరికీ బిగ్‌ఫ్యాన్‌నని తెలిపాడు. గతంలో బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌, కమల్‌హాసన్‌లు హిందీలో 'ఖబడ్దార్‌, గిరఫ్‌తార్‌' చిత్రాలలో నటించారు. 

Kamal Haasan Revealed His Favorite Stars:

Big B and kajol are Kamal Haasan favourite stars 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ