చిరు 151వ సినిమా సైరా నరసింహారెడ్డి వచ్చే నెల 6 నుండి సెట్స్ మీదకెళ్లనుంది. ఇంకా పట్టాలెక్కని సైరా సినిమాలో అన్ని భాషల నటులను ఎంపిక చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్ వంటి నటులను ఎంపిక చేసిన వీరు హీరోయిన్స్ గా నయనతార, ప్రగ్య జైస్వాల్ ని ఎంపిక చేశారు. మరో హీరోయిన్ బ్యాలెన్స్ ఉండగా సైరా సినిమాని ఇండియాలోని నాలుగు భాషల్లో విడుదల చేయాలని సైరా నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డిలు యోచిస్తున్నారు. ఇక సైరా సెట్స్ మీదకెళ్ళక ముందే సైరా డిజిటల్ హక్కులను ఒక ప్రముఖ ఆన్లైన్ వ్యాపార దిగ్గజం అమెజాన్ సంస్థ చేజిక్కించుకున్నట్టుగా వార్తలొస్తున్నాయి.
సైరాకి సంబంధించిన మేకింగ్ వీడియోస్ తో పాటు డీజిల్ హక్కులను కూడా భారీ మొత్తానికి అమెజాన్ కొనుగోలు చేసినట్లుగా న్యూస్ ఉంది. అయితే సైరా షూటింగ్ డిసెంబర్ 6న మొదలెట్టినప్పటి నుండి అమెజాన్ సంస్థ కూడా రంగంలోకి దిగుతున్నట్టుగా తెలుస్తుంది. సైరా సినిమా షూటింగ్ మొదలెట్టినప్పటి నుండి అమెజాన్ కూడా తన మేకింగ్ వీడియోస్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఆ వీడియోస్ కోసం తన ఎక్విప్ మెంట్, తన సిబ్బందిని రెడీ చేసుకుంటూ తన ఏర్పాట్లలో తాను ఉన్నట్టుగా కథనాలు ప్రసారం అవుతున్నాయి.
మరి ఇదేగనక నిజమైతే ఇకమీదట సైరా కి సంబందించిన ఏ విషయాన్నైనా అమెజాన్ నుండే తెలుసుకోవాలేమో... మరి అమెజాన్ వరల్డ్ వైడ్ గా పాతుకుపోయిన ఆన్లైన్ దిగ్గజం. మరి ఈ సంస్థ ద్వారా సైరా ముచ్చట్లు బయటికి వస్తే గనక సైరా పబ్లిసిటీ ఒక రేంజ్ లో కొత్తగా ఉంటుందన్నమాట.