నాడు ఎన్టీఆర్, చిరంజీవి వంటి వారు మంచి చదువులు చదివిన తర్వాతే హీరోలయ్యారు. నాగార్జున, వెంకటేష్, కె.రాఘవేంద్రరావు.. ఇలా పరిశ్రమలో మంచి చదువులు చదివిన వారు ఎందరో ఉన్నారు. ఇక నేటి హీరోలందరూ హీరోలు కావాలనే కోరిక ఉన్నా చదువును నిర్లక్ష్యం చేసినట్లు కనిపించరు. కాగా ఒకానొక వేడుకలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, తనను పలువురు పెద్దలు కలుస్తుంటారని, మా అబ్బాయికి చదవు అబ్బడం లేదు... ఏ పని పాటా లేకుండా తిరుగుతున్నాడు. వారిని కాస్త సినిమా ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇప్పించండని అనేవారని చెప్పుకొచ్చాడు.
ఇక విషయానికి వస్తే నేటిరోజుల్లో చదువులలో పుస్తకాల ద్వారా వచ్చిన బుక్ నాలెడ్జ్ దేనికీ పనికిరావడం లేదు. ఎన్ని డిగ్రీలు చేసినా సమాజంలో ట్రిక్స్ ప్లే చేస్తూ, లౌక్యం తెలిసిన వారే బాగా రాణిస్తున్నారు. అంటే బుక్ నాలెడ్జ్ కంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేదే ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఇక తాజాగా బండ్లగణేష్ విషయానికి వస్తే ఆయన తన కెరీర్‌లో చిన్న చిన్న కామెడీ పాత్రలు, ఎస్వీకృష్ణారెడ్డి చిత్రాలలో చిన్న హాస్యపాత్రలు చేస్తూ వచ్చాడు. కొన్ని అడల్ట్ మూవీలలో కూడా నటించాడు. ఇక ఆయన ఆ తర్వాత మాయమై కొన్నేళ్ల తర్వాత బడా నిర్మాతగా మారి స్టార్ హీరోలు, డైరెక్టర్స్ కాల్షీట్స్‌ని తన లౌక్యంతో సాధించుకున్నాడు. అక్కడి మాటలు ఇక్కడ ఇక్కడి మాటలు అక్కడ చెబుతాడనే చెడ్డపేరు ఆయనకుంది.
కాగా ఆయన కొంత గ్యాప్ తర్వాత మరోసారి నిర్మాతగా ఎలాగైనా స్టార్స్ డేట్స్ సంపాదిస్తానని ధీమాగా చెబుతున్నాడు. ఇక ఈయన మాట్లాడుతూ, నాకు చిన్ననాటి నుంచి చదువు అబ్బలేదు. ఏడెనిమిది తరగతుల్లోనే స్కూల్‌కని చెప్పి, దొంగతనంగా షాద్‌నగర్‌లో ట్రైన్ ఎక్కి, హైదరాబాద్ వచ్చి రెండు చిత్రాలు చూసి మరలా స్కూల్ వదిలే సమయంలో ఇంటికి వెళ్లేవాడిని.. ఇంటర్మీడియట్ కూడా ఫెయిలయ్యాను. ఇక నాకేం చదువు అబ్బుతుంది? చెప్పండి అంటూ నాకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వారు మాత్రం బాగా చదువుతున్నారని చెప్పాడు. జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేలా? అన్నట్లు ఎవరినైనా మాటలతో బోల్తా కొట్టించగలిగిన బండ్లగణేష్‌కి చదువు రాకపోయినా ఇబ్బందేమీ లేదులేండి...!