Advertisementt

సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమాలివే!

Tue 14th Nov 2017 06:49 PM
agnathavasi,jai simha,bhagamathie,rangularatnam,vishal,surya,sankranthi  సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమాలివే!
2018 Sankranthi Release Movies List సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమాలివే!
Advertisement
Ads by CJ

సంక్రాంతి పండగంటే సినీ ప్రేక్షకులకి గుర్తొచ్చేది.. ఆ పండగకు రిలీజ్ అయ్యే సినిమాలు. సంక్రాంతినే టార్గెట్ గా పెట్టుకుని సినిమాలు రిలీజ్ చేయటానికి చూస్తుంటారు ప్రొడ్యూసర్స్. అయితే వచ్చే సంక్రాంతి పండగకు ఆరుగురు హీరోస్ తలపడుతున్నారు. సెలవులని క్యాష్ చేసుకోవడానికి పెద్ద సినిమా నుండి చిన్న సినిమాలు వరకు రిలీజ్ చేయటానికి చూస్తున్నారు.

ఇందులో ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చే సినిమా 'అజ్ఞాతవాసి'. 'కాటమరాయుడు' డిజాస్టర్ తర్వాత పవన్ చేస్తున్న సినిమా కాబట్టి అందులో త్రివిక్రమ్ తో కాంబినేషన్ కాబట్టి జనాలలో భారీ అంచనాలు వున్నాయి. మరి ఇంకో హీరో.. నటసింహ బాలకృష్ణ కూడా తాను నటిస్తున్న 'జై సింహా'తో సంక్రాంతి పండగకు రెడీ అవుతున్నాడు. అనుష్క నటిస్తున్న 'భాగమతి' కూడా ఇదే రేస్ లో వుంది. నేను ఏమి తక్కువ కాదు అని 'రంగులరాట్నం' ఎక్కి వస్తున్నాడు హీరో రాజ్ తరుణ్.

సంక్రాంతి అంటే తెలుగు సినిమాలే రిలీజ్ అవ్వాలా.. మేము కూడా వస్తాం అంటున్నారు తమిళ్ హీరోస్ విశాల్, సూర్య. మరి ఈ ఆరుగురి హీరోస్ లో ఎవరు సంక్రాంతి రేస్ లో నిలబడతారో.. ఎవరు తప్పుకుంటారో చూద్దాం.

2018 Sankranthi Release Movies List :

Agnathavasi, Jai Simha, Bhagamathie, Rangularatnam and Vishal, Surya movies in Sankranthi Release Race 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ