తెలుగులో సంచలనం సృష్టించిన 'అర్జున్‌రెడ్డి' చిత్రంలో విజయ్‌దేవరకొండ, దర్శకుడు సందీప్‌రెడ్డి వంగాలకు ఎంత మంచి పేరు వచ్చిందో హీరోయిన్‌గా నటించిన షాలిని పాండేకి కూడా అంతే పేరు వచ్చింది. ఆమె పెద్దగా అందగత్తె కాకపోవచ్చు. కానీ ఆమె నటనలో సహజత్వం కనిపించింది. బోల్డ్‌సీన్స్‌తో కూడా ఆకట్టుకుంది. సినిమా చూసినంత సేపు ఎలా అనిపించినా, సినిమా చూసి బయటికి వస్తే మాత్రం ఆమె పాత్ర మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇక ఈ చిత్రం తర్వాత ఆమె తమిళంలో నాగచైతన్య-తమన్నాలు నటించిన '100%లవ్' చిత్రానికి రీమేక్‌గా తమిళంలో తీస్తున్న '100%కాదల్' చిత్రంలో హీరో, సంగీత దర్శకుడు జివి. ప్రకాష్ సరసన తమన్నా నటించిన మహాలక్ష్మి పాత్రను చేస్తోంది.
మరోవైపు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రూపొందుతున్న 'మహానటి'లో జమున పాత్రను చేస్తోంది. ఇక విషయానికి వస్తే తెలుగులో ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన 'అర్జున్‌రెడ్డి' తమిళ రీమేక్ 'వర్మ' చిత్రంలో ఇప్పటికే హీరో పాత్రకు విజయ్‌దేవరకొండ స్థానంలో చియాన్ విక్రమ్ కుమారుడు దృవ్‌ని తీసుకున్నారు. ది గ్రేట్ బాలా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలోని హీరోయిన్ కోసం ఆడిషన్స్ నిర్వర్తిస్తున్నారు. ఈ విషయం స్వయంగా విక్రమే తెలిపాడు. నటనపై ఆసక్తి ఉన్న వారు తమ ఫొటోలను, వీడియోలను పంపాలని ఓ మెయిల్ అడ్రస్ ఇచ్చాడు. దీంతో పాటు విక్రమ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని కూడా పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో ఓ అమ్మాయి సముద్రం ఒడ్డున బీచ్‌లో సేదతీరుతూ ఉంటే వెనుక వైపున బ్యాగ్రౌండ్‌లో ఓ లేడీ వాయిస్ వినిపిస్తుంది. ఇలా బ్యాగ్రౌండ్‌లో మాట్లాడింది ఎవరో కాదు.. శృతిహాసన్ అని చెప్పిన విక్రమ్ దాని కోసం ఆమెకు కృతజ్ఞతలు కూడా తెలిపాడు.
ఇక తమిళ చిత్రంలో కూడా వారికి '100%కాదల్'లో నటిస్తున్న షాలిని పాండేనే పెట్టి ఉంటే సరిపోయేది కదా.. అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయినా దర్శకుడు బాలకి ఎవ్వరూ ఒక పట్టాన నచ్చరు. ఆయన స్టైలే డిఫరెంట్. కొత్తవారిని ఎంచుకుని వారిని తనకి తగ్గట్లుగా మౌల్డ్ చేసుకుంటాడు. సో హీరోగా విక్రమ్ కుమారుడు దృవ్‌తో పాటు హీరోయిన్‌గా కూడా కొత్త అమ్మాయి అయితేనే ఆయన మేకింగ్ స్టైల్‌కి సరిపోతుందని ఆయన భావించి ఉంటాడు.