రజినీకాంత్ - శంకర్ కలయికలో లైకా ప్రొడక్షన్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న 2.0 సినిమా జనవరి నెలాఖరున విడుదలవుతుందో... లేకపోతే ఏప్రిల్ కి వాయిదా పడుతుందో? అనే దానిమీద ఎటువంటి క్లారిటీ లేదు. కానీ 2.0 సినిమా వాయిదా పడిందని మాత్రం గట్టిగానే ప్రచారం జరుగుతుంది. 2.0 చిత్ర బృందం గాని... డైరెక్టర్ గాని ఈ విషయమై ఎక్కడా నోరు మెదపడం లేదు. అయితే గత నెలలో దుబాయ్ లో గ్రాండ్ గా ఆడియో ఫంక్షన్ ని జరుపుకున్న ఈ చిత్రం ఈ నెలలో హైదరాబాద్ లో టీజర్ లాంచ్ వేడుకని జరుపుకోవాల్సి ఉంది.
అంతే కాకుండా డిసెంబర్ 12 న చెన్నైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా ఘనంగా జరగాల్సి ఉండగా... ఇప్పుడు హైదరాబాద్ లో జరగాల్సిన టీజర్ లాంచ్ వేడుకతోపాటే డిసెంబర్ 12 న చెన్నై లో జరగాల్సిన ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ కూడా వాయిదా పడిందనే టాక్ కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో వినబడుతుంది. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసేసి విఎఫెక్స్ పనులను, గ్రాఫిక్ పనులను వేగవంతం చేసిన చిత్ర బృందం... ఎప్పుడో ప్రమోషన్ కార్యక్రమాలకు వెల్ కమ్ చెప్పేసింది. కానీ ఇప్పుడు తాజాగా సినిమా వాయిదా పడిందని వార్తలొస్తున్న నేపథ్యంలో.. ఇప్పుడు 2.0 టీజర్ లాంచ్, ట్రైలర్ లాంచ్ వేడుకలు కూడా వాయిదా పడ్డాయని అంటున్నారు.
మరి అసలు ఈ రెండు ఈవెంట్ లు ఎందుకు వాయిదా పడుతున్నాయి అనే విషయం గాని... ఒకవేళ వాయిదా పడిన సమక్షంలో ఆ రెండు ఈవెంట్స్ కి మరో కొత్త డేట్స్ విషయాలు వంటివి తెలియాల్సి ఉంది.