హీరో రామ్ చరణ్ కి పెంపుడు జంతువులు అంటే ఎంతిష్టమో... ఆయన భార్య ఉపాసన తరచూ బయటపెడుతూనే ఉంటుంది. చరణ్ కి గుర్రాలన్నా... కుక్కపిల్లలన్నా.. కోడిపుంజులన్నా.. నెమలులన్నా ఎంతిష్టమో అందరికి తెలిసిన విషయమే. చరణ్ వీక్ డేస్ లో షూటింగ్స్ తో బిజీగా ఉన్నప్పటికీ వీకెండ్స్ లో మాత్రం ఇలా భార్య ప్రేమలోనూ.... తన పెంపుడు జంతువులతోనూ టైం స్పెండ్ చేస్తుంటాడు. అలా స్పెండ్ చేసినప్పుడల్లా ఉపాసన.. చరణ్ తో కలిపి ఆ పెంపుడు జంతువులను కెమెరాలో బందించి మెగా అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.
ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ గుర్రం మీద రైడ్ చేస్తున్న వీడియో ఒకదానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది కూడా రామ్ చరణ్ గతంలో మగధీర సినిమాలో నటించినప్పటి మగధీర గుర్రంపై స్వారీ చేస్తున్న ఫోటో. ఆ ఫొటోతో పాటే.. మిస్టర్ సి ఈ వీకెండ్ ని తన ఓల్డ్ ఫ్రెండ్ మగధీర గుర్రంతో స్పెండ్ చేస్తున్నాడు... అంటూ ట్వీట్ చేసింది. మరి మిష్టర్ సి చేసే పనులు ఉపాసనకు ఎంతగా నచ్చకపోతే ఇలా పోస్ట్ లు చేస్తుంది. ఇకపోతే రామ్ చరణ్ పెళ్లి అయినదగ్గర నుండి తనకు ఏ చిన్న సమయం దొరికినా తన భార్య ఉపాసనతో స్పెండ్ చేస్తూనే అప్పుడప్పుడు ఇలా పెంపుడు జంతువులతో కూడా ఆడుకుంటున్నాడన్నమాట.