Advertisementt

విడాకుల గురించి అప్పుడు చెప్తా: రేణుదేశాయ్!

Mon 13th Nov 2017 04:47 PM
renu desai,divorce,autobiography,renu desai latest interview  విడాకుల గురించి అప్పుడు చెప్తా: రేణుదేశాయ్!
I will reveal the reasons for divorce in my Autobiography: Renu Desai విడాకుల గురించి అప్పుడు చెప్తా: రేణుదేశాయ్!
Advertisement
Ads by CJ

పవన్‌ రెండో భార్య పవన్ నుండి విడాకులు తీసుకున్నా కూడా రేణుదేశాయ్‌ విషయంలో తమ అన్న, వదినలగానే పవన్‌ ఫ్యాన్స్‌ ఆమెని భావిస్తున్నారని అర్ధమవుతోంది. ఆమె తనకు తోడు అవసరం అనిపిస్తోందని చేసిన వ్యాఖ్యలకే ఫ్యాన్స్‌ రెచ్చిపోయారు. పవన్‌ మూడో పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు మరలా తండ్రి అయినా కూడా రేణు విషయంలో పవన్‌ ఫ్యాన్స్‌ తీరు మారలేదు. ఆమె పెళ్లి చేసుకోవడానికి రెడీ అని చెప్పిన వెంటనే ఎవరైనా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి సిద్దమైతే అతడిని ముక్కలు ముక్కలుగా నరికేస్తానని ఓ ఫ్యాన్ ఆమెని భయపెట్టాడంట. అయినా ఓపెన్‌గా పెళ్లికి రెడీ అని చెప్పినా కూడా ఇప్పటివరకు ఆమెను చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడం విచిత్రమే. 

ఇక ఆమె తాజాగా మాట్లాడుతూ, నేను బుద్దిగా చదువుకునే రోజుల్లో మోడలింగ్‌లో ఎలా రాణించానో నాకే ఆశ్చర్యం వేస్తుంది. మోడలింగ్‌ కెరీర్‌లో ఉన్నప్పుడు నాపై నాకు నమ్మకం ఉండేది కాదు.. నాకు ఆ రోజుల్లో ఎవ్వరూ ప్రపోజల్‌ కూడా చేయలేదు. ఇక పవన్‌తో 'బద్రి' చిత్రంలో నటించే సమయంలో మొదటి చూపుకే ఆయన ప్రేమలో పడిపోయాను. లవ్‌ ఎట్‌ ఫస్ట్‌సైట్‌ అంటే ఇదేనేమో... మాది సంప్రదాయ కుటుంబం అయినప్పటికీ అన్ని పవనే చూసుకుంటారనే నమ్మకంతో సహజీవనానికి ఒప్పుకున్నాను. 

నేను విడాకులు తీసుకుని ఏడేళ్లూ పూర్తయింది. ఇప్పుడు దాని గురించి మాట్లాడటం సరికాదు...! విడాకులు ఎందుకు తీసుకున్నానో ఇప్పుడు చెప్పనని, ముసలిదానిని అయిన తర్వాత తన ఆటో బయోగ్రఫీలో రాస్తానని చెప్పింది. తామిద్దరం ఇప్పటికీ మంచి స్నేహితుల్లా ఉంటామని.. మౌనం పరమశీలమని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం 'నీతోనే' డ్యాన్స్‌షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న ఆమె త్వరలో మలయాళంలో ఓ మంచి చిత్రంలో నటించనుందని వార్తలు వస్తున్నాయి. 

I will reveal the reasons for divorce in my Autobiography: Renu Desai:

Renu Desai, The former actress who is busy with a reality show on the small screen has revealed some interesting facts about her personal life in an interview.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ