Advertisementt

ఛార్మీ ప్రేమిస్తుంది ఎవరినో తెలుసా?

Mon 13th Nov 2017 04:34 PM
charmme,pablo,item,mithu,darling,charmi missing,pets  ఛార్మీ ప్రేమిస్తుంది ఎవరినో తెలుసా?
Charmme Missing Her Babies ఛార్మీ ప్రేమిస్తుంది ఎవరినో తెలుసా?
Advertisement
Ads by CJ

నోరులేని జీవాలను ఆదరించడం, వారి బాగోగులు చూడటం మంచిదే. కానీ కొందరు సెలబ్రిటీలు మాత్రం వాటిని స్టేటస్‌ సింబల్‌గా భావిస్తూ వాటి కోసం లక్షల్లో ఖర్చుపెడుతుంటారు. దేశంలో ఆకలికి, వైద్యానికి నోచుకోక మనుషులే పేదరికంలో మగ్గిపోతుంటే వారిని పట్టించుకోని వారు సైతం పెంపుడు జంతువుల కోసం ఎంతైనా ఖర్చు చేస్తుంటారు. ఏది మంచిది.. ఏది తప్పు అనే విషయం పక్కనపెడితే సోషల్‌మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే నటీమణుల్లో ఛార్మీ ఒకరు. అందునా ఆమెకి ప్రస్తుతం సినిమాలు కూడా లేకపోవడంతో పూరి జగన్నాథ్‌ చిత్రాలకు ఆన్‌లైన్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తూ ఆయా షూటింగ్‌లకు సంబంధించిన అప్‌డేట్స్‌తో నిత్యం తలమునకలైపోతోంది. ప్రతి విషయాన్ని సోషల్‌మీడియాలో పంచుకుంటోంది. 

కాగా ఈమెకి కూడా మూగజీవాలంటే చాలా ప్రేమ. ఆమె పెంచుకునే మూగజీవాలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం ఆమె పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో ఆయన కుమారుడు ఆకాష్‌పూరీ హీరోగా నటిస్తున్న 'మెహబూబా' షూటింగ్‌లో భాగంగా పంజాబ్‌, రాజస్థాన్‌లలో ఉంది. తాజాగా ఆమె ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది. తన పెంపుడు జంతువులపై ఆమెకి ఎంత ఇష్టమో ఈ పోస్ట్‌ చూస్తే తెలుస్తుంది. 'మిస్సింగ్‌ మై బేబీస్‌.. వాటిని చూడలేకుండా ఉండలేకపోతున్నా..' అని తెలిపింది. ఈ సందర్భంగా తన పెంపుడు జంతువులతో ఆమె దిగిన నాటి ఫోటోలను షేర్‌ చేసింది. షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల తన పెంపుడు జంతువులను మిస్‌ అవుతున్నానని, వాటిని ఎప్పుడు చూస్తానా? అని ఎదురుచూస్తున్నట్లు ఆమె పెట్టిన పోస్ట్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. 

Charmme Missing Her Babies:

Missing my Babies, can’t wait to c them.. Charmme Posted 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ