Advertisementt

ఒంటరి పోరాటంపై త్రివిక్రమ్ క్లారిటీ..!

Sun 12th Nov 2017 05:07 PM
trivikram srinivas,pawan kalyan,anu emmanuel,agnathavasi,ontari poratam  ఒంటరి పోరాటంపై త్రివిక్రమ్ క్లారిటీ..!
Trivikram Quashes Agnathavasi Copy Rumours ఒంటరి పోరాటంపై త్రివిక్రమ్ క్లారిటీ..!
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం అజ్ఞాతవాసి. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం యూరప్ లో పవన్ కళ్యాణ్, కీర్తి సురేష్,  అనుఇమ్మాన్యుయేల్‌ మధ్య జరుగుతుంది. ఈ సినిమా సంక్రాంతికి  విడుదల కానుంది. 

త్రివిక్రమ్ దాదాపుగా ప్రతి సినిమా ఏదో ఒక మూవీ నుండి ఇన్స్పైర్ అయ్యి తీస్తుంటాడు..లేదా నవల నుండి ఇన్స్పైర్ అయ్యి తీస్తుంటాడు. అయితే అజ్ఞాతవాసి కథ కూడా వెంకటేష్ నటించిన 'ఒంటరి పోరాటం' నుండి ఇన్స్పైర్ అయ్యి తీస్తున్నాడని ప్రచారం జరిగింది. కానీ తాజాగా ఈ అజ్ఞాతవాసి 2011లో వచ్చిన 'ది హెయిర్ అప్పారెంట్'  సినిమా ఇన్సిపిరేషన్ అని సోషల్ మీడియాలో ప్రచారం షురూ అయింది. అసలు సినిమా టైటిల్ కానీ ఫస్ట్ లుక్ కానీ విడుదల అవ్వకముందే ఈ అజ్ఞాతవాసికి ఆ సినిమా ఇన్స్పిరేషన్ ఈ సినిమా ఇన్స్పిరేషన్ అని ప్రచారం జోరుగా జరుగుతున్నా ఈ విషయంపై చిత్ర బృందం నోరు మెదపట్లేదు.

అయితే ఈ అజ్ఞాతవాసి కథ గురించి కూడా సోషల్ మీడియాలో.. పవన్ కళ్యాణ్ ఐడెంటిటీ మార్చుకుని  అజ్ఞాతంలో గడుపుతూ తన సవతి తల్లి పగని తన పగగా మార్చుకుని విలన్ ల భరతం పట్టే కథగా ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా కోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీలో దుబాయ్ లో కనిపించే భారీ ఎత్తయిన కట్టడంపై వుండే టెర్రస్ సెట్ ను వేశారు.  అయితే ఇదే భవనం సెట్ 'ది హెయిర్ అప్పారెంట్' సినిమా ట్రైలర్ లో కూడా కనపడటంతో..అజ్ఞాతవాసి సినిమాకి 'ది హెయిర్ అప్పారెంట్' కి పోలిక పెడుతూ కథనాలు ప్రచారం అవుతున్నాయి.

Trivikram Quashes Agnathavasi Copy Rumours:

Agnathavasi Not Doing Ontari Poratam

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ