ఐదుకోట్లుకూడా లేని రాజశేఖర్‌ని నమ్మి 25 నుంచి 30కోట్లు బడ్జెట్‌పెట్టడం అంటే మాటలు కాదు. దానికి ఎంతో గట్స్ ఉండాలి. ఇక నిర్మాత కోటేశ్వరరాజు రాజశేఖర్ తండ్రికి స్నేహితుడు. ఈయన ముందు వెనుకా, హీరో, డైరెక్టర్ల స్టామినాపై ఆధారపడకుండా ఏకంగా 'పీఎస్వీగరుడవేగ'కి అంత బడ్జెట్‌పెట్టాడు. ఇక సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చినా ఈ చిత్రం అసలైన నిర్మాతలకు మిగులుస్తుందా? అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యాక్షన్ చిత్రం కావడంతో ఫ్యామిలీ, లేడీ ఆడియన్స్ పెద్దగా థియేటర్‌కి రావడం లేదు. లాంగ్‌రన్ మీద ఈ విషయం ఆధారపడి ఉంది. బయ్యర్లు నిర్మాతలు పెట్టిన పెట్టుబడికి తగ్గట్లుగా భారీ రేట్లను చెబితే ఎవరూ ముందుకురాలేదు. దాంతో నైజాంని మార్కాపురం శివకుమార్, ఆంధ్రాని సురేష్‌బాబు, సీడెడ్‌ని సాయికొర్రపాటిలకు అప్పగించారు. మరి ఈ చిత్రం నిర్మాతలకు ఎంత వరకు సేఫ్‌జోన్‌లో వీలుంటే లాభాలలోకి తీసుకొస్తుందా? లేదా? అనేది అనుమానమే.
ఇక ఈ చిత్రం నిర్మాత కోటేశ్వరరాజు ప్రవీణ్‌సత్తార్‌ని కలిసినప్పుడు ఏడెనిమిది కోట్లతో తీద్దామా? 25, 30కోట్లలో తీద్దామా? అని నిర్మాతను అడిగితే... మంచి సినిమా, గుర్తింపు వచ్చే సినిమా చేయాలి... మీ ఇష్టం అన్నాడని నాడు ప్రవీణ్‌సత్తార్ చెప్పుకొచ్చాడు. కానీ ఈ నిర్మాత ట్రైలర్ లాంచ్‌లో తప్ప మరెక్కడా కనిపించలేదు. ప్రమోషన్స్, సక్సెస్‌మీట్, ఇంటర్వ్యూలు, సెలబ్రేషన్స్‌లో కూడా పెద్దగా దర్శనమివ్వకపోవడం ప్రస్తుతం ఎంతో మందికి అనుమానాలు రేకెత్తిస్తోంది. సినిమా హిట్ టాక్ తెచ్చుకున్న తర్వాత కూడా ఆయన కనిపించకపోవడంతో ఆయన నిర్మాత బాధ్యతల నుంచి తప్పుకున్నాడని, అందుకే రాజశేఖర్, జీవితలే ఈ సినిమాని టేకప్ చేశారనే వార్తలు వస్తున్నాయి.
ఇదేమీ రాజశేఖర్‌కి కొత్తకాదు.. ఇలా ఆయన టేకోవర్ చేసిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో 'కట్టప్ప బాహుబలి'ని ఎందుకు చంపాడు? తరహాలో హీరో శేఖర్‌కి క్యాన్సర్ ఉందా? లేక ఆయనను పరీక్ష చేసిన డాక్టర్ కన్‌ఫ్యూజ్ అయ్యాడా? అనే పాయింట్ ఆధారంగా ప్రేక్షకుల్లో క్యూరియాటిసీ పెంచి దీనికి సీక్వెల్ చేసే ఉద్దేశంలో రాజశేఖర్, ప్రవీణ్‌సత్తార్ ఉన్నారట. రాజశేఖర్ హీరో పాత్ర చనిపోవడానికి ఒప్పుకోడు కాబట్టి ఎవరికైనా శేఖర్‌కి క్యాన్సర్‌లేదనే చిన్న లాజిక్ అర్ధమైపోతుంది...!