Advertisementt

'భరత్ అనే నేను' మరో పిక్ లీక్!

Sat 11th Nov 2017 02:51 PM
bharath ane nenu,chief minister,mahesh babu,super star,leak  'భరత్ అనే నేను' మరో పిక్ లీక్!
Another Pic Leaked in Mahesh Babu Bharath Ane Nenu Movie 'భరత్ అనే నేను' మరో పిక్ లీక్!
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ 'భరత్ అనే నేను'. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ శరవేగంగా జరుపుకుంటూ...ఏప్రిల్ 27న విడుదలకి రెడీ అవుతుంది. ఈ సినిమాని  బ్లాక్ బస్టర్స్ ఇచ్చే దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఏ సినిమా అయిన షూటింగ్ జరుపుకునేటప్పుడు ఆ షూటింగ్ సంబంధించి వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ లీక్ అవకుండా చూసుకుంటారు చిత్ర బృందం. అయితే ‘భరత్ అనే నేను’ సినిమా మొదటి నుండి ఏదో ఒక పిక్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు తాజాగా అదే జరిగింది. ఓ పిక్ సోషల్‌ మీడియాలో హంగామా చేస్తుంది..ఇందులో ముఖ్యమంత్రిగా మహేష్‌బాబు కనిపిస్తున్నట్టు ఓ పిక్ వచ్చి వైరల్ అయ్యింది. అందుకు తగ్గట్టుగానే ప్రిన్స్ వెనుక పీఏ బ్రహ్మాజీ, వెనుక కాన్వాయ్.. సెక్యూరిటీగా బ్లాక్ కమెండోలు ఇవన్నీ కనిపించడంతో మూవీపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

నార్మల్‌గా సెట్లో ఫోటోలు లీకైతే కాసింత డల్‌గా వుంటాయి. కానీ 'భరత్ అనే నేను' సినిమా గురించి లీకైన చిత్రాలు క్లారిటీ వుండడంతో కావాలనే యూనిట్ లీక్ చేస్తుందనే ప్రచారం మొదలైంది. ఏదిఏమైనా సోషల్ మీడియాలో ఈ పిక్ లీక్ అవ్వటంతో మహేష్ ఫ్యాన్స్ తన అభిమాన నటుడిని సీఎం పాత్రలో చూసుకుని సంబరపడిపోతున్నారు.

Another Pic Leaked in Mahesh Babu Bharath Ane Nenu Movie:

Bharath Ane Nenu Movie Mahesh Babu CM Look

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ