మామూలుగానే సినిమా బాగోకపోయినా... హిట్ అని పోస్టర్స్ వేసి మరీ మీడియాలో హల్చల్ అయ్యేలా చూస్తారు. మొన్నామధ్యన వచ్చిన అల్లు అర్జున్ 'డిజె' సినిమా పరిస్థితి కూడా అంతే . డైరెక్టర్ హరీష్ శంకర్ మొదటి నుండి సినిమా హిట్ అని తెగ ప్రమోట్ చేశాడు. ఇప్పటికీ ఆ సినిమా నిర్మాత దిల్ రాజు ఆ సినిమా హిట్ అనే చెప్పుకుంటున్నాడు. అసలు సినిమా హిట్టు అయినప్పుడు... ఆ హిట్టే సినిమా గురించి మాట్లాడుతుంది. ఎవరూ దానికి ప్రత్యేకించి డప్పు వేయనక్కర్లేదు.
ఒకవేళ హిట్ సినిమా తీస్తే... డైరెక్టర్స్ చుట్టూ హీరోస్ తిరుగుతారు. మొన్న అనిల్ రావిపూడి తీసిన 'రాజా ది గ్రేట్' సినిమానే తీసుకుంటే, ఆ సినిమా యావరేజ్ హిట్ అయినా దీనిని ఎవరూ పెద్దగా ప్రశంసించలేదు. కానీ ఈ చిత్రం విజయవంతమైంది. అనిల్ తీసిన కొన్ని కామెడీ సీన్స్ ఈ సినిమాలో బాగా హైలైట్ అయ్యాయి. దీంతో అనిల్ రావిపూడి వెంటనే మల్టీ స్టారర్ సినిమా ఒకే అయింది.
మల్టీ స్టారర్ సినిమాతో వెంటనే అనిల్, వెంకటేష్ డేట్స్ సంపాదించాడు. మరి 'డీజే' హిట్ అని చెప్పుకుంటున్న హరీష్ శంకర్‌కి టాప్ హీరోలు అటుంచి నాని, శర్వానంద్ నుంచి కూడా సానుకూల స్పందన రాలేదని చెప్పుకుంటున్నారు. దీంతో కొత్తవాళ్లతో సినిమా చేయాలనీ భావిస్తున్నాడట హరీష్ శంకర్. అయితే దీనికి ఇంకా దిల్ రాజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం లేదు.