Advertisementt

ఉపాసన పోస్ట్ చేసిన ఫొటో వెనుక అంతుందా?

Sat 11th Nov 2017 12:03 PM
upasana,ram charan,childhood picture,social media  ఉపాసన పోస్ట్ చేసిన ఫొటో వెనుక అంతుందా?
Upasana Posted Ram Charan Childhood Photo ఉపాసన పోస్ట్ చేసిన ఫొటో వెనుక అంతుందా?
Advertisement
Ads by CJ

మెగాస్టార్‌ తనయునిగా, మెగా పవర్‌స్టార్‌గా రామ్‌చరణ్‌ నిత్యం సినిమాలతో బిజీ. మరోవైపు ఆయన కొణిదెల బేనర్‌ని కూడా స్థాపించి ఇప్పటికే తన తండ్రి మెగాస్టార్‌ హీరోగా ఆయన 150వ చిత్రం 'ఖైదీనెంబర్‌ 150', త్వరలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న 'బాహుబలి' తరహాలో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా బ్రిటిషర్లకి ఎదురుతిరిగిన తొలి స్వాతంత్య్ర తెలుగు యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌గా 'సై..రా..నరసింహారెడ్డి'ని నిర్మిస్తున్నాడు. ఇందులో బిగ్‌బి అమితాబ్‌, ఏఆర్‌రెహ్మాన్‌ వంటి ఉద్దండులను ఒప్పిస్తూ బిజీగా ఉన్నాడు. మరోవైపు డొమెస్టిర్‌ ఎయిర్‌లైన్స్‌తో పాటు పలు బిజినెస్‌లు చూస్తున్నాడు. 

ఇక ఆయన సతీమణి ఉపాసన కొణిదెల కూడా అపోలో గ్రూప్‌ బాధ్యతలను నిర్వర్తిస్తూ, పలు ఫౌండేషన్స్‌ ద్వారా సామాజిక సేవ చేస్తూ కూడా నిత్యం తన భర్త రామ్‌చరణ్‌ అభిమానులతో తమ కుటుంబ విషయాలు, వ్యక్తిగత విషయాలను సోషల్‌మీడియాలో పంచుకుంటూ యాక్టివ్‌గా ఉంటోంది. ఇలా ఇద్దరు బిజీ అయినా కూడా వీరు ఇప్పటికీ పెళ్లయిన కొత్తజంటలా తమ అనోన్యతను చాటుకుంటు ఉన్నారు. ప్రైవేట్‌ లైఫ్‌కి కూడా ఎంతో ఇంపార్టెన్స్‌ ఇస్తూ విహారయాత్రలతో కూడా బిజీగా ఉంటున్నారు. ఇక భార్యాభర్తలన్న తర్వాత చిన్న చిన్న అలకలు, కోపాలు తాపాలు మామూలే. అందునా ఇద్దరు బిజీ పర్సన్స్‌ కావడంతో పాలపొంగులా కోపతాపాలు వస్తాయి. 

అలాంటి కోపం తనకు చరణ్‌ మీద వస్తే తాను తన భర్త చిన్ననాటి ముద్దులొలికే ఫోటోని చూస్తానని, దాంతో తన కోపమంతా కరిగిపోతుందని ఉపాసన చెప్పుకొచ్చింది. కోపం వస్తే క్యూట్‌గా ఉండే చిన్ననాటి రామ్‌చరణ్‌ ఫోటో చూస్తానని, దాంతో తన కోపం క్షణాలలో కరిగిపోతుందని చెబుతూ ఆ ఫోటోని సోషల్‌మీడియాలో పెట్టింది. మరి చరణ్‌కి ఉపాసన మీద కోపం వస్తే ఆయనేం చేస్తాడో? ఆయన చెబితే గానీ తెలియదు. ఇక ఆమె తన భర్తని మిస్టర్‌ సి అంటూ సంబోధిస్తూ, తాజాగా కూడా అలాగే సంబోధించింది. మిస్టర్‌ సి అంటే మిస్టర్‌ చరణా? లేక ఇంకేదైనా నిక్‌నేమ్‌ పెట్టిందా? అనేది మాత్రం అభిమానులను ఎప్పటినుంచో వేధిస్తున్న ప్రశ్న. 

Upasana Posted Ram Charan Childhood Photo:

Upasana has posted a childhood picture of Ram Charan and captioned it in an interesting manner.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ