దర్శకుడు త్రివిక్రమ్ ఈ మధ్యన తానూ తెరకెక్కించే సినిమాలను కాపీ కంటెంట్ తోనే తీస్తున్నాడనే టాక్ వినబడుతుంది. మొన్నటికి మొన్న నితిన్, సమంత తో తెరకెక్కించిన అ..ఆ సినిమాని మీనా అనే నవల నుండి కాపీ కొట్టి తీసినట్టుగా త్రివిక్రమ్ మీడియా ముందు ఒప్పేసుకున్నాడు. కానీ మీనా నవల రచయిత పేరు అ...ఆ సినిమా టైటిల్ కార్డులో ఎందుకు వెయ్యలేదంటూ నానా రచ్చ జరిగి.... బోలెడు విమర్శలు అందుకున్నాడు త్రివిక్రం. ఇక ఇప్పుడు కూడా ఎన్టీఆర్ తో తెరకెక్కించే సినిమా కోసం డిటెక్టీవ్ అనే నవల హక్కులను త్రివిక్రమ్ కొన్నట్టుగా వార్తలొచ్చాయి. ఆ వార్తలు మరుగున పడకముందే... ఇప్పుడు త్రివిక్రమ్ తాజా చిత్రంపై కూడా అనుమానపు కథనాలు మొదలయ్యాయి
అదేమిటంటే త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, అను ఇమ్మాన్యువల్, కీర్తి సురేష్ లు నటిస్తున్న అజ్ఞాతవాసి సినిమా కూడా మరో సినిమాకి కాపీ అంటూ వార్తలొస్తున్నాయి. అది కూడా పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ వెంకటేష్ పాత సినిమాని స్ఫూర్తిగా తీసుకుని త్రివిక్రమ్ PSPK 25 ని తెరకెక్కిస్తున్నట్లుగా ప్రచారం మొదలైంది. గతంలో వెంకటేష్ నటించిన ఒంటరి పోరాటం చిత్రం మాదిరిగానే పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి కథ ఉంటుందట. అజ్ఞాతవాసి కూడా రివెంజ్ డ్రామానే అని.. వెంకటేష్ ఒంటరి పోరాటంలో జయసుధ కథని నడిపిస్తే.... అజ్ఞాతవాసి చిత్రంలో ఖుష్బూ కథ నడిపిస్తుందంటున్నారు.
ఖుష్బూ తన పగను తీర్చుకోవడానికి పవన్ కళ్యాణ్ ఐడెంటిటీ మార్చి ఖుష్బూ గేమ్ ప్లాన్ ఆడుతుందట. ఇక కామెడీ విషయంలో మాత్రం పవన్ ఈ సారి కాస్త నెమ్మదిస్తాడని.. కానీ పవన్ చుట్టూ ఉన్న పాత్రలు బోలెడంత కామెడీని పండిస్తాయంటున్నారు. ఆ పాత్రల్లో హీరోయిన్ కీర్తి సురేష్ చేసే కామెడీ సినిమాకే హైలెట్ అంటున్నారు.