Advertisementt

మంజుల మనసులో ఇంత వేదన ఉందా?

Fri 10th Nov 2017 12:37 PM
manjula ghattamaneni,manasuku nachindi,follow your heart,mahesh babu,krishna  మంజుల మనసులో ఇంత వేదన ఉందా?
Manjula Manasuku Nachhindi Short Film Released మంజుల మనసులో ఇంత వేదన ఉందా?
Advertisement
Ads by CJ

కృష్ణ పెద్ద కుమారుడు రమేష్‌బాబు హీరోగా, నిర్మాతగా కూడా సక్సెస్‌ కాలేకపోయాడు. ఇక కృష్ణ కుమార్తె మంజులకు బాలకృష్ణ-ఎస్వీకృష్ణారెడ్డిల కాంబినేషన్‌లో వచ్చిన 'టాప్‌హీరో' చిత్రంలో సౌందర్య స్థానంలో అవకాశం వచ్చింది. కానీ కృష్ణ ఫ్యాన్స్‌ అంగీకరించలేదు. తర్వాత నీలకంఠతో 'షో' చిత్రం ద్వారా ప్రయోగం చేసి అవార్డులను కూడా గెలుచుకుంది. తర్వాత 'కావ్యాస్‌డైరీ, ఆరెంజ్‌' చిత్రాలలో నటించింది. ఇక మహేష్‌బాబు హీరోగా నటించిన 'నాని, పోకిరి' చిత్రాలను, నాగచైతన్య-సమంతల మొదటి చిత్రం 'ఏ మాయ చేసావే'లకి నిర్మాతగా పనిచేసింది. ప్రస్తుతం మెగా ఫోన్‌ చేతబట్టి సందీప్‌కిషన్‌ హీరోగా ఓ చిత్రం చేస్తోంది. 

తాజాగా ఆమె తన జీవితంలోని విశేషాలను తెలుపుతూ.. 'మనసుకు నచ్చింది' అనే టైటిల్‌తో షార్ట్‌ ఫిల్మ్‌ని తీసి సోషల్‌ మీడియాలో ఉంచింది. తాను అందరి అమ్మాయిలలాగే ఎన్నో కలలు కన్నానని, నటిగా పేరు తెచ్చుకోవాలిన భావించాను. నటిగా ఫెయిలైతే ఫర్వాలేదు. అసలు అవకాశాలే రాలేదు. దీనికి మా కుటుంబ నేపధ్యం, మా నాన్నగారి అభిమానులు కారణం. నాన్నగారి అభిమానులే సమాజం అని భావించాను. కానీ అది తప్పు అని తెలుసుకునేంతలో విషయం ముగిసిపోయింది. అయినా ఇదంతా నా తప్పే. ప్రయాణం ముఖ్యం... గమ్యం కాదు... ఇప్పుడు మాత్రం మన మనసుకు నచ్చిందే చేయాలని డిసైడ్‌ అయ్యాను. ఫాలో యువర్‌ హార్ట్‌ అనే దిశగా నడుస్తు, సంతోషంగా ఉన్నాను. అందరు మనసుకి నచ్చిందే చేయండి అని చెప్పింది. 

మహేష్‌బాబు ట్విట్టర్‌ లో ఈ లఘు చిత్రాన్ని పోస్ట్‌ చేసి.. 'నా ప్రియమైన సోదరికి పుట్టినరోజు శుభాకాంక్షలు... మంచి ప్రయత్నం' అని కామెంట్‌ చేశాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు స్పందిస్తూ నాకు మంజుల చిన్నదనం నుంచి తెలుసు. ఆమె మనసుకు నచ్చింది చేసే మహిళ, ఆమె తన ప్రయత్నం ద్వారా మ్యాజిక్‌ క్రియేట్‌ చేయనున్నారని శుభాకాంక్షలు తెలిపాడు. 

Manjula Manasuku Nachhindi Short Film Released:

Manjula Ghattamaneni's Manasuku Nachindi drives home a message - follow your heart

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ