విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చింది ఒక కొత్త దర్శకుడితో... పెళ్లి చూపులు సినిమాని కొత్త దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించాడు. అసలు విజయ్ కి కొత్త దర్శకులతో వర్క్ చేయడం కొత్తేంకాదు. మొన్నామధ్యన సూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి సినిమాను కూడా విజయ్ కొత్త దర్శకుడు సందీప్ వంగా దర్శకత్వంలోనే నటించాడు. కాకపోతే ఈ రెండు సినిమాల సక్సెస్ తర్వాత విజయ్ దేవరకొండకు బడా దర్శకుల సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి. విజయ్ దేవరకొండతో స్టార్ డైరెక్టర్స్ అంటున్నారు గాని విజయ్ ఎక్కడా బడా దర్శకులతో కమిట్ అయినట్లుగా న్యూస్ లేదు.
విజయ్ దేవరకొండతో ఆ స్టార్ డైరెక్టర్... ఈ లెజండరీ డైరెక్టర్ అనే న్యూస్ వస్తున్నప్పటికీ... అతడు మాత్రం కొత్త దర్శకులకు అవకాశాలిస్తూన్నాడని అంటున్నారు. త్వరలోనే విజయ్ దేవరకొండ భరత్ కమ్మ అనే మరో కుర్రాడ్ని డైరక్టర్ గా పరిచయం చేయబోతున్నాడు అని అంటున్నారు. పెళ్లిచూపులు సినిమాను నిర్మించిన బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ తో కలిసి మరో బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ కొత్త సినిమాను నిర్మించనుందని సమాచారం. అసలు నిజానికి భరత్ కమ్మ అనే వ్యక్తి బిగ్ బెన్ నిర్మాతలకే ఈ కథ చెప్పాడు.
అయితే బిగ్ బెన్ సినిమాస్ వాళ్ల దగ్గర విజయ్ దేవరకొండ డేట్స్ ఆల్రెడీ ఉన్నాయి. మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ హీరోతో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించడంతో.... ఈ నిర్మాతలకు భరత్ కమ్మ చెప్పిన స్టోరీలైన్ నచ్చడంతో.. బిగ్ బెన్ సినిమాస్ తో కలిసి సంయుక్తంగా నిర్మించేందుకు మైత్రీ మూవీ మేకర్స్ వారు సిద్ధమయ్యారు. అయితే ఈ సినిమాకి సంబంధించి అధికారిక వివరాలు త్వరలోనే మీడియాకి తెలియజేస్తారట.